సద్భావన



ఆశ -ఆనందం నడుమ అనంతానంత అగాధం
ఆనందపు అనుభూతిని అందుకొనుట ఎంత కష్టం
అంతటా కంటకాలు
కందకాలు, అడ్డంకులు నిరాశ, నిస్పృహ దుఖం , బాధ, క్రోధం
అత్యాశ, అహంకార మదపూరిత, మాస్తార్యంఆ అడ్డంకులు ,ముళ్ళపొదలు
అన్ని అన్నింటిని అగాధాన నెట్టి వైచి
త్రిప్తి అనే వంతెన తో ఆవలి తీరం చేరుకో
అనుభవించు అనుభవించు ఆనందపు లోకమదే
అంతా నీకొరకే!

రచన: నూతక్కి రాఘవేంద్ర రావు తేది :౧౮-౦౨-2009


నీటి లోతు తెలుసుకొని
ఈత కొరకు దిగు గాని
అన్తెరుగని కొలనులోన
తలమునకలు కాబోకు
వ్యాపారం వ్యవ హారం
అంతా అనుభవ సారం
ఆను పాను తెలియకుండ
అందులోన అడుగెయ్యకు

రచన: నూతక్కి రాఘవేంద్ర రావు , కూర్పు-మార్పు తేది:౧౮-౦౨-2009


అందుబాటులో వున్న
పూవు కోసుకో గాని
చిట్ట చివరి కొమ్మ నున్న
పండు కొరకు పాక బోకు
దొరికిన దానితోనే
సంతృప్తి ని పొందు కాని
దొరక నట్టి దానికొరకు
వేసటపడి భంగ పడకు.

రచన: నూతక్కి రాఘవేంద్ర రావు ,మార్పు తేది:౧౮=౦౨-2009


అపుడెపుడో ఏదేదో
చేయ లేదె అనుకుంటూ
నిట్టూర్చుతూ కూర్చుంటే …
ఇపుడైనా చేయకుంటే !!!
జరిగిన కాలమింక నీ
దరికి మరలి రాదు కదా !
జీవన కాలమేమి
కొంచమైన పెరగదు కదా !
తెలుసుకొంటే
వెసులు బాటు
తెలియకుంటే
కర్మ కాటు

రచన:నూతక్కి రాఘవేంద్ర రా వు , మార్పు తేది :౧౮-౦౨-2009


ధనం తోటి కొన్న బలం
వుంటున్దొక క్షణ కాలం
మనం ఒకటి అన్న బలం
నిలిచి వుండు కలకాలం

రచన: నూతక్కి రాఘవేంద్ర రావు. మార్పు తేది :౧౮-౦౨-2009