కిటికీ కావల
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు
తేది :10-04-2009
 
ఆకలి  అంటే  ఆరవ  వద్దని
ఆవలికంపిన  అమ్మహాత్ములు
మస్తుగ తిని మంచాలెక్కితే 
సత్తువ లేక తూలుతు తూలుతు
మండుటెండలో ఇసుక మేటపై
తను  విరుచుక పడితే
ఎయిర్ కండిషన్ రూముల్లో
డన్లప్ పరుపుల జమ్పింగుల్లో 
ఆనందాలను ఆస్వాదిస్తూ 
ఆ క్షణాన 
ఆ కిటికీకావల 
దూరంగా
కని పించే  యా దృశ్యం
ఆనందాన్నే యిచ్చిందో
ఆహ్లాదమే కలిగించిందో ……