Energy and fuels


భారత ప్రభుత్వం ద్రుష్టి సారించిన సోలార్ ఎనెర్జీ

రచన: నూతక్కి రాఘవేంద్ర రావు.

Dt: 27-02-2010

2010/11 వ సం/ బడ్జెట్లో భారత ప్రభుత్వం సాంప్రదాయేతర ప్రక్రియలైన సౌర మరియు పవన విద్యుత్తు వ్యవస్తల వైపు పెద్ద ఎత్తున ద్రుష్టి సారించినట్లు కనబడుతోంది .ఇది అందరం అహ్వానించ దగ్గ పరిణామం.ముదావహం.లోగడ యెన్నో పర్యాయాలు నా బ్లాగుల్లో యీ విషయం పై నా గోడు వెల్లడించిన సందర్భాలున్నాయి.యీ ప్రక్రియలపై చిత్త శుద్ధితోప్రభుత్వాలు నిబద్ధతతో వుంటే సామ్ప్రదాయ, అణు ఇంధన వనరులకొరకు విదేశాలపై ఆధార పడవలసిన అవసరం వుండదు.మన యింధన వనరులను ఎగుమతి చేసి ఆర్ధిక స్వావలంబన పొందవచ్చు. అణు ఇంధనం, ఆయిలు ఇంధనం కొరకు దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్ట వలసిన అవసరం వుండదు.

వికేంద్రీక్రుత రీతిలో యీ ప్రక్రియ కొనసాగాలి. భారీ విద్యుత్ ప్రోజెక్టుల నిర్మాణం వైపు కాకుండా అందుకై వెచ్చించే ధనాన్ని సోలారుకిట్లపై, వెచ్చించి ప్రతి యింటా ప్రభుత్వ ఖర్చు పై వాటిని స్థాపించాలి . తొలుత కిట్లు దిగుమతి చేసుకున్నా తదుపరి ఆయా వుత్పత్తిదారులను భారత్ కు ఆహ్వానించి, భారత్ లోనే వుత్పత్తిని ప్రోత్సహించాలి.

ప్రతి యింటి అవసరానికి మించి వుత్పత్తిఅయ్యే విద్యుత్తును ప్రభుత్వం తానే తీసుకొని తన భారీ అవసరాలకు వినియోగించవచ్చు. సోలార్, మరియూ పవన విద్యుదుత్పత్తికై ప్రతి పరిశ్రమలోనూ నిర్బంధ విధానాన్ని ప్రవేస పెట్టాలి.

గాలీ ,సూర్య రశ్మీ విరివిగా లభించే భారత దేశం వంటి దేశాలలో యీ ప్రక్రియలు దిగ్విజయమౌతాయి.

శాస్త్ర సాంకేతికపరిగ్నాన లభ్యత, యంత్ర పరికరాల లభ్యత, అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు వెంటనే ప్రారంభిస్తూ ,సాంకేతిక ప్రతిభ గల మానవవనరులను అభివ్రుద్ధి పరచ వలసిన కార్యక్రమం వెనువెంటనే చేపట్టవలసిన భాద్యత ప్రభుత్వాలపై వుంది. కెనడాలోలా,జెర్మనీలోలా ,ప్రతి యిల్లూ ఓ విద్యుదుత్పత్తి కేంద్రం గా ప్రభుత్వాలు మార్చగలిగితే

నిరంతర విద్యుత్ అంతరాలనుండి విప్లవాత్మక విశ్రాంతి లభించి విద్యుత్ పరికరాల వినియోగం ప్రతి యింటా పెరుగుతుంది. ఆయా గ్రుహవినియోగ విద్యుత్ పరికరాల వుత్పత్తుల తయారీ పరిశ్రమలూ పెరుగుతాయి..సోలార్,పవన విద్యుత్ వుత్పాదక పరికరాల కై పరిశోధనాలయాలూ తద్వారా పరిశ్రమలూ, సాంకేతిక పరిగ్నానం రుగుతుంది.వుపాధి అవకాశాలూ పెరుగుతాయి.నిరుద్యోగ సమస్య తగ్గి దేశ ఆర్ధిక పరిస్థితి పురోగమనంలో సాగుతుంది.

ముదావహం

(సోలారు ఎనెర్జీ వైపు ప్రభుత్వముందడుగు)

రచన: నూతక్కి, తేదీ:09-11-2009

 ప్రభుత్వం విన్నదా నేనన్న,

 “భవిష్యత్ రారాజు సోలార్ ఎనెర్జీ”

అన్నట్లు అటుగా తన ధ్రుఃక్కులు

సారిస్తూ ఆంధ్ర ప్రదేశ ప్రభుత.

యింతదనుక నిరాసక్త ,అలసత్వ,

విధానాల సుధీర్ఘ కాల విలంబనలు

అయినా,యిప్పటికైనా ఆ దిశగా

 తప్పటడుగులైనా

పరిణామం ప్రశంసనీయం.

అభినందనీయులు

ముఖ్యామాత్యులు

 శ్రీరోశయ్య వరేణ్యులు .

 అడుగులేయడం

నేర్చుకుంటే నే కదా

 నడకైనా, పరుగైనా.

సాంప్రదాయ విధానాలు

 ఇంధన అలభ్యత.

ఒట్టిపోతూ జల వనరులు,

 పరుషమైన పర్యావరణం

యిబ్బడి ముబ్బడి

 యిబ్బందులు యేనాడూ

 అంతరాయం లేకుండా

అందని నిరంతరమన్న విద్యుత్తు

 ఇంధనానికై విదేశీ గుమ్మాలెక్కి….

సార్వభౌమత్వాన్నిఫణంగా పెట్టిమరీ……

 ఇంకానా !!! ఏమాత్రం అక్ఖరలేదిక

విద్యుదుత్పాదనలో ! ! !

ఇంధనం అపార సూర్య రశ్మి

వుచితం …సంకల్పం సమయోచితం..

 ముదావహం

భవిష్యత్ రారాజు. సోలార్ ఎనెర్జీ

 ( విద్యుదుత్పత్తి_ యితర ప్రత్యామ్నాయ విధానాలు )

        యీ బ్లాగులో ప్రచురించబడిన 200 వ టపా

రచన: నూతక్కి రాఘవేంద్ర రావు తేదీ: 26-10-2009

                     _ ద్విశత టపోత్సవం _ 

ప్రపంచ వ్యాప్తంగా యీ రోజున యింధన సమస్య, విద్యుత్ సమస్య. మానవుడు తాను కనిపెట్టి తన సౌకర్యానికై వినియోగించుకోవాలనుకున్న పరికరాలకుకావలిసిన విద్యుత్శ్చక్తి లభించడం లేదు.అధునాతన సౌకర్యాలకై అధునాతన పరికరాలు వినియోగించుకొనే దిశగా అడుగులు ముందుకు వేయలేకపోతున్నాడు. యీ భూ ప్రపంచంలోని ప్రతి దేశం తన నిత్యావసర ఇంధనావసరాలకై జాతీయ స్థూలాదాయంలోనుండి ఎంతో ఎక్కువశాతం ఇంధన దిగుమతులపై ఖర్చు పెడుతోంది.లేదా భూగర్భ ఇంధన వెతుకులాటకై పరిశొధనలలోనో, లేదా వెలికితీతలోనో వెచ్చిస్తోంది. అది బొగ్గు కావచ్చు, ఆయిలు కావచ్చు,గ్యాసు కావచ్చు. అణు యింధనం కావచ్చు.

వీటిని వినియోగించి నీటిని,వేడి చేసి ఆవిర్భవించిన శక్తిని వినియోగించి టర్బైన్ లను నడిపి విద్యుత్ జెనరేటర్లు నడపి విద్యుదుత్పాదన సాధించడమే అంతిమ లక్ష్యం. వీటన్నింటికీ యింధన లబ్ధి ముఖ్యం.అందుకొరకు భూమి లోలోతు పొరలపై ఆధారపడాలిసిందే.ఆ తరువాత భూ వుపరితలాన వాటిని వినియోగకరంగా మార్చే దిశలో ఎంతో పర్యావరణ కాలుష్యం. అదీ కాక యీ పైన పేర్కొన్న యింధనాల వెలికితీత కార్యక్రమం అభివ్రుద్ధి చెందుతున్న, చెందని దేశాలకు కఠిన పరీక్ష.ఎన్నో లక్షల మంది నిర్వాశితులౌతున్నారు. ఆపై వాటివల్ల వుత్పన్నమయ్యే పర్యావరణ సమస్యలు మరో పెద్ద సమస్య. భూగర్భం లోనుండి ప్రతి దేశం తమ ఇంధన అవసరాలకనో ,యితర కారణాలకో, భూగర్భ పదార్ధాలను వెలికి తీస్తూ పోతే, భూ గర్భంలో ఏర్పడే ఖాళీ వల్ల భూమికి వుత్పన్నమయ్యే తీవ్ర దుష్పరిణామాలు భూమి పై జీవుల వునికికే తీవ్ర విఘాతం కలిగించే దారుణ స్థితి యెర్పడే అవకాశాలు కనపడుతున్నాయి.

ఇప్పటికే ప్రాధమికంగా విద్యుత్పాదనకు సాంప్రదాయ వనరుగా ప్రసిధ్ధి చెందిన నీరు ఏయేటికాయేడు లబ్ధి లేకుండా పోతోంది. వర్షాలు లేక నీటి వనరులు అడుగంటి పోతున్నాయి.ప్రపంచ వ్యాప్తంగా భష్యత్తులో,.జల విద్యుత్ ప్రోజెక్టులు తీవ్ర సమస్యలలోకూరుకు పోయే ప్రమాదం వుంది. నీరు లబ్ధి లేకూంటే యితర సాంప్రదాయ వనరులైన ధర్మల్,ఆటమిక్ పవర్ వంటి వుత్పత్తులకూ తీవ్ర ఆటంకం ఏర్పడే పరిస్థితులు వుత్పన్నమౌతున్నాయి. ప్రపంచం ఎదుర్కొంటున్న యీ దారుణ పరిస్థితులను అధిగమించి ,యింధనంకొరకు యుద్ధాలు ఆపి ప్రత్యామ్న్యాయ విధానాలకొరకు పరిశోధనలు జరిపి సాంప్రదాయేతర విధానాలతో శక్తిని వుత్పత్తి చేసి వినియోగించ గలిగితే తాను కనిపెట్టిన అధునాతన పరికరాలు మానవుడు తన సౌకర్యార్ధం వినియోగించుకోగలుగుతాడు. లేకుంటే ఎన్ని పరికరాలు కనిపెట్టినా యేకొద్దిమందికో తప్ప వినియోగపడవు.

 నిరంతర మైన, నిరాటంకమైన,పర్యావరణానికి ,భూమి వునికికి విఘాతంలేని ప్రత్యమ్నాయ వనరులలో 1) గాలి నుండి, wind energy, 2)సముద్ర అలలనుండి (Tidal energy).౩) సూర్య రశ్మి నుండి , Solar energy ముఖ్యంగా చెప్పవచ్చు.యిప్పుడు వాటి గురుంచి నాకున్న పరిమిత పరిగ్నానంలో వివరిస్తాను.

 1) విండ్ ఎనెర్జీ (wind energy): గాలి విరివిగా వీచే ప్రదేశాలు కనిపెట్టి ఆయా ప్రాంతాలలో ఎక్కువ సంఖ్యలో గాలి మరలు యేర్పరచి,వాటిని విద్యుత్ జెనెరేటర్లకు అనుసంధానం చేసి తద్వారా ప్రతి మరనుండి వుత్పత్తి అయ్యే విద్యుత్తును సమాంతరంగా అనుసంధించి ప్రస్తుత కేంద్రీక్రుత గ్రిడ్ విధానంలో వినియోగదారులకు, ప్రస్తుత రీతిలోనే ఆయా వనరులు వినియోగించుకొని సరఫరా చేసుకోవచ్చు. దీని స్థాపనకై అయ్యే ఖర్చు యెక్కువేఅయినా నిర్వహణ ఖర్చులు ,అణు విద్యుత్ ప్రోజెక్టులకో, జల విద్యుత్ ప్రోజెక్టులకో ,ధర్మల్ విద్యుత్ ప్రోజెక్టులకో అయ్యే ఖర్చులో సగానికి సగం తగ్గించ వచ్చు. ఇంధనంపై ఖర్చు చేయవలసిన అవసరాలుండవు.అణు యింధనానికై విదేశాలపై ఆధారపడి దేశ సార్వభౌమాధికారాలకు ముప్పు తెచ్చుకోనవసరం లేదు.ఆ కారణంగా అంతర్యుధ్ధాలు కొని తెచ్చు కోనవసరం లేదు. ప్రస్తుత సాంప్రదాయవిద్యుఠ్ వనరులపై భవిష్యత్తులో పెట్టదలుచుకున్న ఆర్ధిక వనరులతో యీ ప్రోజెక్టులు చేపట్టి దేశ భవిష్యత్తును వుజ్వలం చేసుకోవచ్చు. యిబ్బందులు: గాలి అన్ని వేళలా ఆయా ప్రాంతాలలో అదే ఫోర్సు తో ప్రసరిస్తుందన్న నమ్మకం లేదు. కాబట్టి వుద్యుత్ నిలువ సామర్ధ్యం(storage capabilitiees) పెంచుకొనేందుకు ద్రుష్టి పెట్ట వలసిన అవసరం వుంది., ఆ ప్రత్యేక సాంకేతిక సామర్ధ్యం సమకూర్చుకోవలసిన అవసరం యేర్పడుతుంది ,

 2) సముద్ర అలల నుండి(Tidal energy): భూమి పై మూడొంతులు సముద్రమే.భూమినిరంతరం తనచుట్టూ తాను పరిభ్రమించడం వల్ల యేర్పడే పరిస్టితి నుండి సముద్రాలలో నిరంతరం అతి శక్తి వంతమైన అలలు వుత్పన్నమౌతుంటాయి. ఆ శక్తిని వినియోగించుకొని అనేక ప్రాంతాలలో విద్యుదుత్పాదన చేయగలిగే సాంకేతిక, ఆర్ధిక సామర్ధ్యం వుంటే విద్యుత్ వుత్పత్తి చేసి ప్రస్తుత రీతిలోనే సరఫరా చేసుకోవచ్చు. దీని స్థాపనకై అయ్యే ఖర్చు యెక్కువేఅయినా నిర్వహణ ఖర్చులు ,అణు విద్యుత్ ప్రోజెక్టులకో, జల విద్యుత్ ప్రోజెక్టులకో ,ధర్మల్ విద్యుత్ ప్రోజెక్టులకో అయ్యే ఖర్చులో నాలుగో వంతుకు తగ్గించ వచ్చు. వినియోగదారునికి విద్యుత్ అందాలంటే ప్రస్తుత గ్రిడ్ విధానాలతో కేంద్రీక్రుత సరఫరా వ్యవస్త లను వినియోగించుకోవచ్చు ఇంధనంపై ఖర్చు చేయవలసిన అవసరాలుండవు.అణు యింధనానికై విదేశాలపై ఆధారపడి దేశ సార్వభౌమాధికారాలకు ముప్పు తెచ్చుకోనవసరం లేదు.ఆ కారణంగా అంతర్యుధ్ధాలు కొని తెచ్చు కోనవసరం లేదు. యిబ్బందులు: కావలిసిన సాంకేతిక పరిగ్నానం సమకూర్చుకోవలసిన అవసరం దానికి కావలసిన ఆర్ధిక వనరులు సమకూర్చుకోవడంలో సమస్యలు. కానీ ప్రస్తుత సాంప్రదాయవిద్యుత్ వనరులపై భవిష్యత్తులో పెట్టదలుచుకున్న ఆర్ధిక వనరులతో యీ ప్రోజెక్టులు చేపట్టి దేశ భవిష్యత్తును వుజ్వలం చేసుకోవచ్చు. యిక పోతే …

సొలార్ ఎనర్జీ (Solar Energy): the pure energy and green energy. యీ భూ ప్రపంచంలో వున్న మూడొంతుల భూ భాగంలోధ్రువ ప్రాంతాలు తప్పించి మిగతా 80% భూభాగంలో రోజుకు ఆరు గంటలనుండి పది గంటల వరకు సూర్య కాంతి లభిస్తుంది. ఆ కాంతి వల్ల లభించే శక్తిని మన దైనిక విద్యుత్ అవసరాలకు వినియోగించుకొనే శాస్త్ర పరిగ్నానం,పరిశోధనా స్థాయినుంచి వుత్పాదనా, వినియోగ స్థాయిలకు ఎదిగింది.కాని ,దాని వినియోగం కొన్ని దేశాలకే పరిమితమయింది కాని,అన్ని దేశాలకు, అన్ని స్థాయిల వినియోగదారులకు యింకా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం వాడుకలో వున్నట్లుగా,చిన్న చిన్న పరికరాల చార్జింగుకో, నీటిని వేడి చెసుకొటానికో మాత్రమే పరిమితం కాకుండా,విద్యుత్త్ ను నిలువ చేసుకొనే ప్రత్యమ్న్యాయాలు అభివ్రుద్ధి పరచుకొని,పెరుగుతున్న అన్ని గ్రుహోపయోగావసరాలకూ సోలార్ విద్యుద్వినియోగం జరిగినప్పుడు, మన దేశం లాటి అభివ్రుద్ధి దిశలో పయనించే దేశాలకు క్రొత్త భారీ విద్యుత్ ప్రోజెక్టులపై, భారీ మొత్తంలొ వెచ్చించవలసిన అవసరం రాదు. తద్వారా మిగులుతున్న ఆర్ధిక వనరులతో యింటింటికీ ఓ 5k.w సోలార్ ఎనెర్జీ కిట్ గనుక, జాతీయ భాద్యతగా అందించితే..ఆ ధనాన్ని నెల నెలా విద్యుత్ బిల్లులా కొన్నినెలల కిస్తుల రూపంలో వెనక్కు రాబట్టుకోవచ్చు.సరఫరాకొరకు,స్థంభాలు, తీగలూ నియంత్రణ వ్యవస్త అవసరం వుండదు కాబట్టి ప్రభుత్వానికి సరఫరా, నియంత్రణ పై ఖర్చులు వుండవు.భారత దేశంలో ప్రతి పూరి గుడెసెకు,నట్ట నడి అడవిలో వున్నా,ఎడారి మధ్యలోవున్నా కూడావిద్యుత్అందినప్పుడే,దేశం కొంతలో కొంత అభివ్రుధ్ధి చెందినట్లు. .

 ప్రతి గ్రుహ వినియోగదారుడూ తమ స్థాయిలోసూర్య శక్తి వినియోగించి ఓ విద్యుత్ వుత్పాదకుడవ్వాలి.. ప్రజలకు సరైన,అవగాహన, ఆర్ధిక సహకారం అంది, ప్రతి గ్రుహస్తుడూ తక్కువలో తక్కువ సగటున 05kw విద్యుత్తును వుత్పత్తి చేసుకోగలిగే లా , వ్యవస్త యెర్పడితే, విద్యుత్ అంతరాలనుండి విరామం దొరుకుతుంది. వినియోగ దారుడు, ఆర్ధిక పరిపుష్టి చెంది, మరిన్ని విద్యుత్పరికరాలు వినియోగించే స్థితికి చేరుతాడు. . తద్వారా ఆయా పరిశ్రమలూ పెరుగుతాయి. పారిశ్రామిక వుద్యోగ అవకాశాలు పెరుగుతాయి, యిలా ప్రతి దేశంలోనూ ఆచరిస్తే ప్రపంచ వ్యాప్తంగా ,నిరుద్యోగ సమస్య చాల వరకు పరిష్కరించబడుతుంది,కొనుగోలు శక్తి పెరుగుతుంది.

యీ ప్రక్రియ కెనడాలో అమలులో వున్నది. కాకుంటే ప్రభుత్వమే ప్రతి గ్రుహస్తుకూ సోలా ర్ ప్యానెల్ వ్యవస్త ఏర్పరుస్తారు.. అందు నుంచి వుత్పత్తి అయిన విద్యుత్ సరఫరా వ్యవస్తకు కలుపుతారు.ప్రతి యూనిట్ కూ వారి అవసరాలకు ప్రభుత్వం నుంచి అందే ధర కన్నా ఏడు రెట్లు ఎక్కువ ధర చెల్లిస్తారు.యీ విధానం గ్రీన్ ఎనెర్జి యాక్ట్ ద్వారా అమలు చేస్తున్నారు.

గ్రుహ విద్యుత్ అవసరాలు సూర్యుని శక్తితో తీర్చుకోగలిగినప్పుడు, క్రొత్తగాప్రతిపాదించి,నిర్ర్మించ తల పెట్టిన నూతన విద్యుత్ ప్రోజెక్టులను, విరమించుకొని, తద్వారా మిగిలే ఆర్ధిక వనరులు, యీ విధంగా సోలార్ ఎనెర్జీ వుత్పత్తికై ప్రోత్సాహకాల రూపంలొ అందించవచ్చు. నూనె, బొగ్గు, అణు యింధనం,వగైరాలను, యితర సామాజిక అవసరాలకు, శాంతియుత ప్రయోజనాలకు, అభివ్రుధ్ధికి, మళ్ళించ వచ్చు..

ప్రస్తుతం కెనడాలో వికేంద్రిత సోలార్ విద్యుదుత్పత్తి ఇంటింటా ప్రభుత్వ పర్యవేక్షణలో జరుగుతోంది. స్పైన్ దేశంలో11M.W to 50M.W వరకు,అమెరికాలో 64M.W నుండి 354 M.W వరకూ భారీ స్థాయిలో సోలార్ విద్యుత్ వుత్పత్తి చేస్తున్నారు.

మనం మన దేశం లో భారీ సోలార్ ప్రోజెక్టులు నిర్మించనవసరం లేదు.కెనడా దేశ విధానాన్ని కూడా పాటించనవసరం లేదు.పెద్ద సోలార్ ప్రోజెక్టులకయ్యేద్రవ్యాన్ని ,భవిష్యదవసరాలు ద్రుష్టిలో వుంచుకొని ప్రతి గ్రుహస్తుకు వారి వారి అవసరానికి విద్యుత్ వుత్పాదన చేసుకొని నిలవ చేసుకొనే పరికరాలను వుచితంగానో, సబ్సిడీ ధరలకో యేర్పాటు చేసి యిస్తే , ప్రతి యింటా విద్యుద్పత్తి జరిగి, దేశంలో ప్రస్తుతం జరుగుతున్న విద్యుదుత్పత్తినుండి గ్రుహావసరాలకు యివ్వ వలిసిన అవసరం వుండదు. తద్వారా మిగిలిన విద్యుత్ను యితర ప్రయోజనాలకు వినియోగించ వచ్చు. అదే విధంగా అన్ని పరిశ్రమలనూ నిర్బంధ సోలార్ విద్యుదుత్పాదనా సంవిధానంలోకి తెచ్చి,వుత్పత్తి ఖర్చులను నియంత్రించ వచ్చు.

విద్యుత్ లోటును పూడ్చుకొని దేశం పురోగమనం సాధించ వచ్చు. విద్యుదుత్పత్తికై ఆయా దేశాలు ఇంధనవనరులు వినియోగించ వలసిన అవసరంలేదు, ఇంధనం కొరకు యితర దేశాలపై ఆధారపడవలసిన అవసరం లేదు.

ఇంతటి బ్రుహత్తర బహుళ ప్రయోజనాలున్న యింటింటా సోలార్ ఎనెర్జీ వుత్పత్తికీ, వినియోగానికీ ప్రభుత్వాలు ఎక్కువ ప్రాధాన్యాన్నిచ్చి, ఆ దిశగా క్రుషి చేసి ఆ ఆశయాన్ని త్వరితగతిన సాధించేందుకు సాంకేతిక నైపుణ్యాన్ని అభివ్రుద్ధి చేసుకొని స్వయం సమ్రుద్ధి సాధించవలసిన అవసరం ఎంతైనా వుంది. ఇప్పటివరకు ఆ దిశగా క్రుషి జరగకపోయినా పొరపాటు కాక పోవచ్చుకానీ, యికనయినా స్పందించక ఆ దిశగా పయనించకపోతే , దానికై ఆర్ధిక వనరులు సమకూర్చకుంటే అంతకన్న దుర్గతి,ఘోర తప్పిదం మరేమీ వుండదు.

ఈ సూర్యశక్తి వినియోగించి చేసే విద్యుదుత్పాదన వల్ల, యే దేశమైనా ,తమ దేశ యింధన వనరులు వేరెవరో కొల్లగొట్టుకు పోతున్నారనే భావన ఆయా ప్రజల మనోభావాలనుండి తొలగి,వుగ్రవాద భావనలు సమసి పోయి, ప్రస్తుత భయానక ప్రపంచంలోని భయానక వుగ్రవాదం తిరోగమన పధంలో పయనించడానికి సోలార్ ఎనెర్జీ ముఖ్య భూమిక పోషిస్తుందనీ ప్రపంచాన శాంతి పరిఢవిల్లుతుందని నా ఆకాంక్ష.