కృష్ణార్పణం
రచన: నూతక్కి
సర్వులకూ శుభ సంక్రాంతి
కృష్ణార్పణం ……
అంటూ ఆ హరి దాసు….
ఆతని పేరేమిటో,
వూరేమిటో ఏమీ తెలియదు
గాని,
ఆ అనుబంధం
అంతరించి
అర్ధ శతాబ్ది దాటినా
ఇప్పటికి …
ఆ పదం ..
కృష్ణార్పణం…
శ్రవణా నంద కరం
ఆ ఆహార్యం
ఆ గానం, గాత్రం ,నృత్యం ,
వాద్యం,పలుకు, నడక,
నడత అంతా ,ఆ జ్ఞాపకాల
అలజడులు కంపనలు
నా మస్తిష్కపు ,లోలోతుల ,
నా తనువున కణ కణా న,
నా మది లోపలి పొర పొరలో
పదిలంగా భద్రంగా…
..కృష్ణార్పణం..