expressions


అవును నిజం

రచన: నూతక్కి

 09-03-2019

అవును నిజం

ప్రజలు మూర్ఖ్హులు

 బాబాల మత్తుల్లో

యువ భారతి

 కునారిల్లే దౌర్భాగ్యాం

 ప్రభుత్వాలు కనిపెట్టి

అడ్డుకోలేనప్పుడు

అధినేతల ఆలంబనలో

 బాబా.స్వామి, సాధు,

 సంతు వ్యవస్తలున్నప్పుడు

       నిత్యం నా చుట్టూ  -8

           ( ఓ  చిన్ని జూ)
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు 
        తేది :26-05-2009
 
తడి మట్టిని తొలుస్తూ వాన పాము
     మురుగులోన  మండూకం 
       చండాలంలో పందులు 
          వీధుల్లో  శునకాల  
             స్థైర్య విహారం
       ఎన్నెన్నో సహజీవులు
          యింకా యింకా
    ఏమని వ్రాయను యిప్పుడు?
              హతోస్మి !
    గొంగడి పురుగును మరచితినే
 
నిత్యం నా చుట్టూ -6 
  (ఓ  చిన్ని జూ)
 
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు 
   తేది :26-05-2009
 
కోడి పిల్లలల్ని ఎగదన్నుకు
        పోదామని
   ఆకసాన నిఘావేసి
ఎగురుతూ తిరుగాడుతూ 
       గరుడ పక్షి 
ఎక్కడో ఏదో ఆవో దూడో 
    చచ్చి పడుందని
     ఆచూకీనందిస్తూ 
   ఆకసాన రాబందులు
  గున గున గంతులతో 
     కుందేలు జంట 
    గుర్రున చూస్తూ
       కుక్కపిల్ల 
   అంతా గమనిస్తూ 
 అటకమీద పిల్లి కూన 
 
నిత్యం నా చుట్టూ   -5
   ( ఓ  చిన్ని జూ)
 
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు 
   తేది :26-05-2009
 

    కలుగులు త్రవ్వుతూ

         పందికొక్కు
      చెంగు చెంగున 
  గెంతులేస్తూ  లేగ దూడ ,
    గేదలు దున్నలు
 ఆవులు ,ఎడ్లు ,కోడెలు 
    గిత్తలు ,పెయ్యలు 
    కొబ్బరి చెట్ల పైన
 కొంగల సయ్యాటలు
కొక్కోరోమని కోడిపుంజు
  పిల్లలతో గంపక్రింద
         కోడిపెట్ట 
నిత్యం నా చుట్టూ-4
     ( ఓ  చిన్ని జూ)
 
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు 
   తేది :26-05-2009
 
       చిట్టి చిట్టి చేతులతో
  వేప పండు తింటూ వుడుత
    కలుగులోని ఎలుక  పిల్ల
   దాని వెంటే   త్రాచుపాము 
    రాత్రయితే కీచురాళ్ళు 
     రాళ్ళ క్రింద  తేళ్ళూ
     అక్కడే పెరిగే  జెర్రులు 
    రజకులు పెంచుకొంటూ
 తోలుకు వచ్చే గాడిదలూ 
      కంచర గాడిదలూ 

నానోలంటే ఎట్లున్టయొ జర సెప్ప రాదే ?

రచన : నూతక్కి రాఘవేంద్ర రావు

 తేది:20-౦4-2009

 నానోలు రాసేతోల్లన్దర్కి దండాలు.

 నాగ్గిట్ట సమఝ్ కాకుంటున్నది,

 జర ఎరకయ్యేట్టు సెప్ప రాదె..

నానోలు గిట్ల అంటున్నరు గంద.

 గావాటిని ఎట్ల రాయాలె

గిట్ల రాయొచ్చ సారూ..

 బెల్లం ముక్క మోసుకుకెల్త సీమ

గా సీమని తినుకుంట బల్లి

దమాక్ల తిట్టుకుంట

 గిదేంది సీమ తియ్యంగుంది! .

 

ఎలక మందున్న మాంసం ముక్క

 ఆరగించింది ఎలుక దాన్నితిన్న కుక్క

 దిమాక్ల తిట్టుకుంట ఏందిది

ఎలక గిట్ల బగ్గ తాగినట్టుంది.

 

 గివి నానొ లయితవా సారూ. …నూతక్కి రాఘవేంద్ర రావు

శాంతి జల్లు
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు
తేది :16-04-2009
 
నీలో నీ మదిలోనీ హృదిలో 
 క్రోదాగ్నిని ఆర్పివేస్తే
శాంతం అధిగమించి
సౌజన్యం వుద్భవించి
 చైతన్యం రగులుతుంది
లావణ్యం నీ హృదిలో
నవనీతం నింపుతుంది.
కారుణ్యం నీ గుండెల
కలకాలం వుంటేనే
తోటివాని   సహకారం
తర తరాలు నిలుస్తుంది

   –  ప్రేరణ –

రచన : నూతక్కి రాఘవేంద్ర రావు
Date:08-04-2009
అణుమాత్రం ప్రోత్సహించు
క్షణ మాత్రం ప్రశంసించు
ఆత్మీయత ప్రోది చేసి
ఆలంబననందించు
నిబిడాశ్ఛర్యంలో  నీవుండగానె
నిర్దేశిత పద గమ్యం
చేరిపొవు చిటికలోన.

నీ బాల్యం నీదికాదు

కాకూడదు,పెద్దల
తలిదండ్రుల కనుసన్నల
నిరంతర పరి వేక్షణ 
అనుక్షణం అడ్డంకులు 
అభ్యంతరాలు  ఇది ముట్టుకోకు 
అది  పట్టుకొకు,అరవమాకు 
ఎడ్వమాకు  అరచి అరచి
గొల చేసి  ఇంటి  కప్పు
లేపమాకు, పీకి పందిరెయబోకు
నా చిట్టి కన్నా బుజ్జి నాన్నా
ఏడ్వబోకు రా వెర్రి తండ్రి
అంతలోనె అసహనం 
మరింతలోనె  బుజ్జగింపు
నీకింకేదో కావాలి
వింత వింత శబ్దాలతో
సఙలు   చేస్తూ నీవు
ఏడుపు  లంకించుకుంటె   
 
పిచ్చివాళ్ళు వాళ్ళ కేదో
నీ  అరుపుల మాటల  కేకల
శబ్దార్ధాలు అర్ధమైనట్లు
వాళ్ళేదో ఆట బొమ్మనందిస్తె 
 
నీకేమో అది నచ్చదు కద
నేకింకేదోకావాలి మరి
నీ మాట,  నీభాష, నీ భావం
అర్ధం చెసుకొలేని అమాయక ప్రాణులు మరి.
ఆకాశపు చందమామ
పరుగెట్టుకు పోయే
మేఘపు తునకలు ,
ఎగురుతున్న రాచిలుకలు
రొడ్డున పొతూ అరిచె
కుక్కను చూడాలని పాపం 
పాపం నీ ఆరాటాలెన్నెన్నొ   
అన్ని    కావాలని
వాటితో నీవూ ఎగరాలని 
నీవనుకుంటున్నావని …
వాళ్ళకు తెలియదుగా పాపం
అన్నీ తెలుసనుకుంటారు 
వెర్రివాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో
ఆకలి అయ్యిందా,కదుపునొప్పి వచ్చిందా
చీమకాని కుట్టిందా 
ఎందుకో  మా చిట్టి గాడు  ఏడుస్తున్నాడిట్లా
వాళ్ళ ధొరణిలొ వాళ్ళు. 
 రచన: నూతక్కి రాఘవెంద్ర రావు తెది:05-04-09.