expressions


జలపుష్ప విలాపం

(జలపుష్పాభిషేకం సంకలనానికై ప్రత్యేకం)

 రచన: నూతక్కి రాఘవేంద్ర రావు

 తేదీ:04-10-2009,

01-20hrs

 యీ ప్రుధ్వీ తలాన జలచరమై

 సముద్రాలలొ,మహా సంద్రముల

సెలయేరున ,నదీ నదాలలొ

 వాగులు వంకలు బావులలో

చెరువులు గుంటలు పంట కాల్వలొ

 ఎచ్చట నైనను నా వునికికి

అనుక్షణం బ్రతుకు సంకటం

నాబ్రతుకు,నా ప్రాణం అంతా నీరే

నీరే,నీరే ,నీరే నాబ్రతుకుకు

 ఆధారం ఆనీరే కలుషితమై

 కల్మష విష కాసారమై

క్షణ క్షణం అనుక్షణం

 ప్రాణభయం కర్మాగారపు

విష రసాయనాలు

 పెట్రోలియమ్ వుత్పాదనలూ

 అది యిది కాదు

ఎన్నొ ఎన్నో ఎన్నెన్నో

 చెబుతూ పోతే రామాయణమే

 జలాశయం

చిన్నదొ పెద్దదొ మహాధధో

అన్నింటా నా వునికికె సంకటం

జలపుష్మం సుందర నామం

నా జీవితమే గందర గోళం

 నేనో దైవ స్వరూపమట

మనిషికి నను చంపి

తినేందుకు వెనుకాడట

కొండొకచో పుష్పించకనే

ఎండిన బ్రతుకై

జీవితమిచ్చిన వాడే

 నను పెంచి నా జీవన కాలం

నిర్ణయించి చంపేస్తుంటే

ఆహారమై మనిషికి

 మేధస్సును పెంచుతుంటె

ఆ మేధస్సే మము తుదముట్టిస్తే

 మేమెవరికి చెప్పుకోము

 మా గోడెవరికి చెప్పుకోము?

 నా కన్నీరే మహా సంద్ర మై ….

ఏమోఏమో ఏమౌతుందో

 నా వునికే ఓ ప్రశ్నార్ధకమై.

ఎరా రంగు చీర కట్టి

 (ఆరెంజ్ ఫిష్)

(జలపుష్పాభిషేకం సంకలనానికై ప్రత్యేకం)

 రచన: నూతక్కిరఘవేంద్ర రావు

తేది:03-10-2009

 ఎరా రంగు చీర కట్టి

అమాయకంగ ముఖం పెట్టి

పెద్ద కళ్ళు విప్పారిచి

పవిటలు అల్లార్చుకుంటు…

సుందర భామిని

 యా మత్స్య కన్నియ

వయ్యారంగా హొయలుపోతు…

నే చూస్తూనిలబడ్డా నిశ్చేష్టుడనై

ఆ అధ్భుత విన్యాసం

నయనానందకరం

నన్నే చూస్తోంది

గుడ్లప్పగించి

ఆ నీటి కదలికలోనే

 నిలకడగా ఆశగా ఆర్తిగా

 గాజు గోడ ల మధ్య

గాలి బుడగల కదలికలు

నీటిలో తేలియాడుతూ

అను నిత్యం మిత్రులతో

 సయ్యాటలలోతీరిక దొరకని

 ఆమత్స్య కన్నియ

నను చూస్తూనే చంగున

దూసుకొచ్చి నావైపు తిరిగి

నా కన్నుల లో తన కనులు కలిపి

కను గీటిన భావన…….

 గత కాలపు మధురోహల

 సయ్యాటల వేసటలో

 ఒక్క క్షణం…..

నా మది పులకరింత.

 ( పై పార్టు పైకి చదవకండేం…

 జాగ్రత్త !మా ఆవిడ!

అమ్మో! నా పార్టులు)

తన ఆహారం

 తనకందించ మనీ

 నాకదించిన సూచన

 ప్రతీ పూట నేనందించే

ఆహారపు గుళికలకై

వినమ్రంగా యాచన

 వివరించలేని అనుబంధం

 ఎందులకో నాహ్రుది

తంత్రులలో కదలాడిన

 మధుర భావ వేదన

 
మహాత్మా !!!
  
(నీ ఆశకు అంతుండాలిసింది)
రచన: నూతక్కి రాఘవేంద్ర రావు వు
  02-10-2009 
   
బాపూ!!!
క్షణక్షణం భయం భయం  మహాత్మా!!మా కోసం!!!

మరొక్క సారి తిరిగి రావా ! 
 

నిరంతరం నిను యీ దేశం లో

స్మరించుకోనివారుండరు
మరో కొన్ని దశాబ్దాలు శతాబ్దాలు
 నీ వేదో యీ దేశానికి
సేవలు చేసావని కాదు కానీ
 నీవు గుర్తున్నావనీ కాదు బాపు!ఆ రోజున నువు అరువిచ్చిన

ఘనమైన నీ యింటి పేరు…

బాపూ! ఏదయినా చేద్దువు

మహాత్మా!మా కోసం!!!

మరొక్క సారి తిరిగి రావా ! 

 

నీ  పేరు చెప్పుకొని
నీ అనుయాయులు
వారసత్వ రాజకీయ
 దౌర్బల్యపు కశ్మలాన
 నీవందించిన యీ 
దేశపు స్వాతంత్రం
 పర దేశ పు వ్యక్తుల
కనుసన్నల  మహాత్మా

ఇపుడయినా

రొక్క సారి తిరిగి రావా!

 ఏదయినా చేద్దువు !మా కోసం!!! 

తరతరాల బానిసత్వ

శ్రుంఖలాబద్ధ

జన మానసాలు

రాజకీయ

స్వయంశక్తి స్వతంత్ర

భారతిలో 

 

ఏనాటికీ ఓ మ్రుగత్రుష్ణ బాపూ  

స్వతంత్ర భారతిలో అనుక్షణం
అసహనం అనుమానం అభద్రత
రాజకీయ అస్థిరత్వ భావనం
యువ శక్తుల నిరుద్యోగ దుర్బలత్వం
 అహరహమూ ఆత్మ పీడనం,
 బాపూ ఇపుడయినా , 
 ఏదయినా చేద్దువు మా కోసం!!!  
 మరొక్క సారి తిరిగి రావా
నీ వాశించిన గ్రామస్వరాజ్యం
నీవాశించిన స్త్రీ స్వరాజ్యం
నీవాశించిన పేదల రాజ్యం… బాపూ ! అవి కాన రావు

యీ స్వతంత్ర భారతిన

లంచాలూ ,ప్రజా ధన దోపిడీలు
స్త్రీ హత్యలు  మానభంగ పర్వం
అంతా ఆశాభంగం నీ
 ఆశకు అంతుండాలిసింది బాపూ!!!
ఇపుడయినా మహాత్మా !
మరొక్క సారి తిరిగి రావా  
 ఏదయినా చేద్దువు !మా కోసం!!!సకల

ప్రపంచం సర్వవేళలా నీ

నామ జపం శాంతి మంత్రం శాంతి

శాంతి శాంతి బక జప

ధ్యానం నీ నామ జపం బాపూ

!!! భూగోళం అణ్వాయుధ భాండారం

జగమంతా

ఫటేలుమని….……….ఆ వూహే ఓహ్!!!!

 

 

 

ఇపుడయినా మహాత్మా ! 

 

 

 

మరొక్క సారి తిరిగి రావా  
ఏదయినా చేద్దువు !మా కోసం

 

బాపూ

!!!

ఇదే మాజోహారురచన

: నూతక్కి రాఘవేంద్ర రావు

తేది:year 1962 లో నా స్కూలు రోజుల్లో వ్రాసిందిజోహారు గాంధి తాత

జోహారు శాంతి దూత

జోహారు స్వతంత్ర ప్రదాత

జోహారు తాడిత పీడిత

జన శ్రేయఃకాంక్షిత

పందొమ్మిది వందల

నలుబది ఎనిమిది

జనవరి ముఫ్పై తేదీనా

మతోన్మాది యా గాడ్సేచేతి

తుపాకి కెరఅయి అసువులబాసీ

అమరుడయ్యి నావు

జోహార్ గాంధి తాత

జోహార్

!జోహార్ !జోహార్ !

 
అప్పటికి నా వయసు యింకా అయిదేళ్ళే !!!
 
 తేది :01-10-2009 రచన :నూతక్కి రాఘవేంద్ర రావు.
 
( Inspiration :సునీత గారు వారి బ్లాగు లో వ్రాసిన ఇదీ సంగతి-9).
 
 
 
నేను మా యింట్లో మచ్చు(అదో పెద్ద అటక ) మీద, యింట్లో వాళ్ళకు
 
 తెలియకుండా వాళ్ళను మభ్య పెట్టి ఎన్ని సారులో. అవి పెట్టినగుడ్లను ఆ
 
కోడి పెట్టల చేతనే పొదిగించి, అన్ని గుడ్లూ పొదగబడి బయటకు వచ్చిన
 
తరువాత వాటిని క్రిందకు దించి యింట్లొ వాళ్ళను ఆశ్చర్యానికి గురిచేసిన
 
సందర్భాలు,మొట్టికాయలతో తల బొప్పి కట్టిన సందర్భాలు ,ఎన్నో
 
 ఎన్నెన్నో.ఆ బాధలన్ని….. గుడ్లలోని పిల్లలు బయట పడే ప్రయత్నంలో
 
గ్రుడ్డు మధ్యలోచుట్టూరా లోపలనుండే ముక్కుతో పొడుస్తూ గ్రుడ్డు డొల్లను
 
రెందు సమ భాగాలుగా చేసుకొని బయటకు రావడం చూస్తే ఆ
 
మొట్టీకాయల నొప్పులేపాటివి? …… ….సరేలెండి ….ఆ అనుభవం
 
అనుభవానికి రావలిసిందే కాని ……యింకా ఎంతో వుంది వ్రాయటానికి .ఆ పిల్లల్ని గద్దలనుంచి ,  

 

.ఎవరు నేర్పారమ్మ ఆపిల్లకూ

డొల్లనట్టుల పగులగొట్టాలనీ ,

పగుల కొట్టీ భువిని చేరాలనీ

తల్లి రెక్కల క్రింద దాగాలనీ..

.ఎవరు నేర్పారమ్మ…………..అలా అలా …వాటికి మరి ఆహారం….చిట్టు

 జల్లించి సన్నని బియ్యం ముక్కులు సేకరించి (కొట్టు గది నిండా చిట్టూ

తవుడూ వుండేదిలెండి. వాటి గొంతుకు అడ్డం పడగూడదని అతి సన్న

నూక కోసం దొరక్క యీ పని చేసేవాడిని. ) వాటికి మేపేవాడిని.ఆ పిల్లల్ని

 చూస్తే పిల్లలికే కాదు,ఎప్పుడూ మడీ తడీ ,శుచీ, శుధ్ధీ ,వుండే మా

ప్రక్కింటి బ్రామ్మల బామ్మగారు కామేశ్వరమ్మబామ్మ గారు కూడా ఎవరూ

చూడ కుండా తల్లిని తరిమి పిల్లల్ని చేతుల్లోకి తీసుకొని వళ్ళు తడిమి

వదిలేవారంటే!!(అయినా తల్లి కోడి ఆమెను వదిలేది కాదనుకోండి) మొదటి

నెలలోపు వయసు కోడి పిల్లలని చూస్తే ముట్టుకోవాలని ఎవరికి వుండదు

?

ఆ విషయంలో ఎవరూ అతీతులు కారు..

(ఆమె ను ఆటపట్టించే విషయమ్ అదో ప్రహసనమ్,)నేను కోడి పిల్లల్ని

పొదిగించినప్పుడల్లా నన్ను అన్ని రకాలుగా శాపనార్ధాలు

పెట్టేదనుకోండి.అందుకే మా గోడెక్కి వాళ్ళ దొడ్లోకి చూస్తూ యిట్లాంటివన్నీ

చూసినప్పుడు ఆట పట్టించేవాడిని. అది వేరే విషయం అనుకోండి.

యింకా ఎంతో వుంది వ్రాయటానికి .ఆ పిల్లల్ని గద్దలనుంచి ,

కాకులనుంచి,పిల్లులనుంచి, వూరకుక్కల నుంచి కాపాడుకోవడం మరో

పెద్ద ప్రహసనం. యిక పోతే ప్రక్కింటి వాళ్ళతో మరో గొడవ.ఇంతే కాదు మా

కోడి పెట్టలు వెళ్ళి వేరే వాళ్ళ దొడ్లలో గుడ్లు పెట్టడం,వాటి కోసం నేను ప్రతి

రోజూ వాళ్ళతో కొట్లాడి గుడ్లు తీసుకు రావడం మరో ప్రహసనమ్.

మా అమ్మ మీద గౌరవం తో నన్నేదన్నాఅనడానికి వెరచే వాళ్ళు. అదీకాక ……………….

అప్పటికింకా నా వయసు యింకా అయిదేళ్ళే!!!

.

 

 

 

 

 

Etv వారి “బ్లాక్” సంగీత కార్యక్రమం _1

 (నిర్వాహకులు ధన్యులు,అభినందనీయులు)

రచన: నూతక్కి రాఘవేంద్ర రావు. తేది:30-09-2009
 
 
యీ వేళ బుధవారం అనగా తేదీ:30-09-2009 Etv వారి  
 
“బ్లాక్” ప్రోగ్రాం వస్తుందని అన్ని పనులు మానుకొని ఆ పోగ్రామ్
 
చూసే అవకాశం పోగొట్టుకోవద్దని కూర్చొన్నాం.  
  
కొన్ని ముఖ్య మైన తెలుగు చానళ్ళలోనూ బాలల సంగీత కార్యక్రమాలు
 
అత్యధ్భుతంగా ప్రదర్శింప బడుతున్నా, Etv వారి బ్లాక్సంగీత
 
కార్యక్రమం అన్నింటిలోకి ప్రత్యేకమైంది, అపురూపమైంనది. ఎందుకంటే నేత్ర వైకల్యం కల బాల బాలికల కొరకు వారికి ప్రత్యెకించ బడింది మరి.

Etv వారు….., వీక్షకులు అచ్చెరువందే లా కళాత్మకంగా ,సుందరంగా నెమలి నాట్య భంగిమ కు ప్రతీకగా ,

వేదికను, మ్యూజిక్ కు అనుగుణంగా నర్తించే సప్త వర్ణ శోభిత

విద్యుద్దీప లతలతో, ఎంతచూసినా చూడాలనిపించే రీతిలో సుందర

మహాధ్భుత ద్రుశ్య కావ్యంలా రూపొందించారు..

యీ” బ్లాక్” అనే సంగీత  కార్యక్రమం నిరంతరంగా అనేక నెలలుగా ప్రపంచ
 
వ్యాప్తంగా తెలుగు వారిని అలరిస్తున్న విషయం ఎల్లరకూ విదితమే.
 
ఎంతోమంది ఔత్సాహిక అంధ బాలగాయనీ గాయకుల లోనుంచి అనేక
  
 పరీక్షలకు ఎదురొడ్డి నిలచి తమ సామర్ధ్యాన్ని నిరూపించుకొంటూ
 
“ఫైనల్” కు చేరిన మువ్వురు గాయకులు అంతిమ పోటీని
 
ఎదుర్కొని ఒకరు విజేత నిలుస్తారు.
 
ఫైనల్పోటీ మొదటి ఎపిసోడ్ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా
విచ్చేసిన ప్రముఖ సినీపాటల రచయిత శ్రీ సిరివెన్నెల

సీతారామశాస్త్రి నుడివినట్లు “ఆ బాల గాంధర్వుల శక్తి యుక్తులను

జడ్జ్ చేసేందుకు జడ్జీలకే శక్తి సరిపోదేమో” నన్నంతగా ఆ చిన్నారి

గాయకుల ప్రతిభ వుంది.

అట్టి మహత్తర కార్యక్రమం వీక్షించాలని ఎవరికి వుండదు చెప్పండి?

యీ ఫయినల్ పోటీ రెండు రోజులు నిర్వహింప బడుతుంది.  

 

యీ వేదికపై తమ గానం తో వీక్షక, శ్రోతల హ్రుదయాలను

చూరగొంటూ అలరిస్తున్న చిన్నారి గాంధర్వులు యీ ప్రపంచాన్ని

వీక్షించలేని నేత్ర రహితులు.

 కొన్ని నెలలుగా కొన సాగుతున్న యీ కార్యక్రమం, వారిలోని గాన

ప్రతిభను వెలికి తీయడానికీ మరియూ వారి గాత్ర సామర్ధ్యాన్ని

ప్రపంచానికి చాటడానికున్నూ.

 తమ గాత్ర మాధుర్యాన్ని చవి చూపిన బాల

గాయకులు, తమ మధుర గానం తో, అత్యధ్భుత ప్రతిభా పాటవాలు

ప్రదర్శించి,సంగీతానికి అవధులేవీ వుండవనీ ,నేత్రలేమి అడ్డంకి

కాదనీ ,శరీరాంగాలన్నీ సవ్యంగా వున్న,తమ వయసున్న

ప్రతిభావంతులైన గాయనీ గాయకులకు తామేమీ తీసిపోమనీ,

ప్రపంచానికి మరోసారి చాటి చెప్పిన యీ కార్యక్రమం ,అధ్భుతం,

అత్యధ్భుతం .

 నిబద్ధతతో ఈ కార్యక్రమాన్ని ప్రజలకు

అందిస్తున్న, నిర్వాహకులు Etv వారు ధన్యులు ,

అభినందనీయులు .

 
 
 
 
 

 

 

వివిధ భావనలు, నిమ్న యోచనలు

 రచన: నూతక్కి రాఘవేంద్ర రావు.

తేది: 29-09-2009

చిట్టి చిట్టి పదాల కూర్పులు

 కవి అల్లిన చిరు కవితలు

నిభిడీక్రుత భావనలు

విడుస్తున్న నిట్టూర్పులు ….

తమ విశాల విశ్వ రూపం

 కుబ్జమై కుదింప బడు తోందని .

తెలియదు లే !! పాపం !!

విభిన్న భావ, భావనలకు…

తమ ఔన్నత్యం,

తమ వునికి

వివిధ సంక్షిప్త భంగిమల

 విశ్వ వ్యాప్త విస్త్రుతికై

నిరంతరం క్రుషి చేస్తూ

వున్నాడని

తమ కొరకే అనవరతం

 తపన పడుతు వుంటాడని.

సొతంత్రం రాలేదు ఎందుకనో!!!

 రచన :నూతక్కి రాఘవేంద్ర రావు

 తేది :15-08-2009

సొతంత్రమొచ్చి దేశానికి

 ఏళ్ళు పూళ్ళు గడుస్తున్నా

 సొతంత్ర భారతాన మనిషికి

యింకా సొతంత్రం రాలేదు ఎందుకనో!!!

 భక్షకులై రక్షక భటులు

 రక్షణ కరువై పౌరులు 

 సొతంత్ర భారతాన మనిషికి

 యింకా సొతంత్రం

రాలేదు ఎందుకనో !!!

పర రాజ్యపు పాలనలో

వుందేమో !జుట్టు పన్ను

 సొతంత్ర భారతాన

బతికుంటే బతుకు పన్ను

 పంటి పన్ను కంటి పన్ను

 తిండిలేక చస్తుంటే

 వేసేస్తాం కరువు పన్ను

 సొతంత్ర భారతాన

మనిషికి యింకా

 సొతంత్రం రాలేదు ఎందుకనో!!!

 పస్తులుండి రూక రూక కూడగట్టి

ఖాళి జాగా కొనుక్కొంటే

 వేసేస్తాంఖాళి జాగ పై పన్ను

 నీడ కొఱకుగూడు కడితే

 గూటిపైన కూడ పన్ను

 సొతంత్ర భారతిలో మనిషికి

 యింకా సొతంత్రం

 రాలేదు ఎందుకనో !!!

సారాయి అమ్ముకునే

 ప్రభుత్వాలు

 తాగకుంటె పన్నేస్తవి

గుత్తెదారుల 

 తొత్తులుగా

 ప్రపంచ బ్యాంకుకు 

బానిసలై

 పాలితులను ఫణంగా …. పాలకులు

సొతంత్ర భారతిలో పౌరులకింకా

సొతంత్రం రాలేదు ఎందుకనో !!!

సెజ్ ల పేరిట ఆస్తులు

 దోచుకొంటు

 ప్రజలు బికారులౌతుంటే

సొతంత్ర భారతిలో

 పౌరులకింకా సొతంత్రం

రాలేదు ఎందుకనో!!!

 ప్రజలు తప్పు చేయకుండ

చూడాల్సిన ప్రభుత్వాలు

 తప్పులు చేయించి మరీ

డబ్బు దోచుకుంటూ టే .

 సొతంత్ర భారతిలో పౌరులకింకా

సొతంత్రం రాలేదు ఎందుకనో !!!

అయినా కొందరికి …

అంతా సొతంత్రమే!

 ఖైదుల్లో వుండాల్సిన

 దొంగలు దోపిడిదారులు

గూండాలూ హంతకులూ

అధికారం చేబట్టి యిపుడు

 రాజ్యాలను ఏలుతుంటే

 అది కాదా సొతంత్రం !!!!!

నాడు

 కూటికి కొరగానివారు

నేడు

 అదినాధులు, సంపన్నులు.

 అదికాదా సొతంత్రం!!!!!

 రహదారులు, ప్రాజెక్టులు,

 వ్యవసాయం, పరిశ్రమలు

 మంచి నీరు, మురుగునీరు

 రైళ్ళు ఇవి అవి ఏవైనా

అన్నింటా తమ కుక్షి ముందు….

 కొందరైన సుష్టిగా

దేశాన్నిభోంచేస్తే

అది కాదా సొతంత్రం !!!!!,

 పేదరికం నిర్మూలనేల?

పేదల నిర్మూలన …చేసేస్తే పోలా….

దేశమంతా సంపన్నులే

నిరు పేదలు ఇంకెక్కడ?

 పట్టపగలు నడిరోడ్డున

ఆడపిల్ల గొంతుకోసి

 చంపేస్తే, హంతకుడు

అయిపోడా రాత్రికి రాత్రే

 ఎమెల్లె,

 యాసిడుపోసి అసువులు 

తీస్తే

అతనికి దక్కద ప్రభువుల కొలువు,

ఇదికాదా సొతంత్రం?!!!!!

ఇంతకు మించిన సొతంత్ర భారతి

మరేదిశలో,మరేతీరున ….?

ఆ దిశలో సాధన లో

ప్రభుత! అది కాదా సొతంత్రం !!!!!

సుప్రభాతం నాడునేడు

(

నిరంతర అంతరాల విన్యాసం) 5

రచన:నూతక్కి రాఘవేంద్ర రావు.

తేది:26-09-2009

నేతి గిన్నెలోయిడ్లీ ముక్కలు

వేడి పొగల కాఫీ కప్పులు

మొన్న……

బ్రాందీ కప్పుల్లో చికెన్ ముక్కలు

గొంతుల్లో విస్కీ గుక్కలు

నిన్న……

మరి నేడో……ఏమో!!!

అయ్యారే!!!తరతరాల

అంతరాల నిరంతర విన్యాసం

సుప్రభాతం నాడునేడు

(

నిరంతర అంతరాల విన్యాసం) 4

రచన:నూతక్కి రాఘవేంద్ర రావు.

తేది:26-09-2009

చద్దన్నం ముద్ద పెరుగు,

ఎరగారపు వూర ముద్ద ,

ఆవురావురున నోరూరిస్తూ

నాడు….

వూరూరా కొన కొనలో యీ ధరా తలాన

తలచుకోను నామోషీ

నేడు…….

అయ్యారే!!!తరతరాల

అంతరాల నిరంతర విన్యాసం

« గత పేజీతర్వాత పేజీ »