greeTings


కృష్ణార్పణం


రచన: నూతక్కి

సర్వులకూ శుభ సంక్రాంతి

 

కృష్ణార్పణం ……

అంటూ ఆ హరి దాసు….

ఆతని పేరేమిటో,

వూరేమిటో ఏమీ తెలియదు

గాని,

ఆ అనుబంధం

అంతరించి

అర్ధ శతాబ్ది దాటినా

ఇప్పటికి …

ఆ పదం ..

కృష్ణార్పణం…

శ్రవణా నంద కరం

ఆ ఆహార్యం

ఆ గానం, గాత్రం ,నృత్యం ,

వాద్యం,పలుకు, నడక,

నడత అంతా ,ఆ జ్ఞాపకాల

అలజడులు కంపనలు

నా మస్తిష్కపు ,లోలోతుల ,

నా తనువున కణ కణా న,

నా మది లోపలి పొర పొరలో

పదిలంగా భద్రంగా…

..కృష్ణార్పణం..

 

సంక్రాంతి శుభాకాంక్షలు

ప్రపంచ వ్యాప్త తెలుగు సాహితీ హితులు,

బ్లాగ్మిత్రులు, స్నేహితులకు అందరికీ
యీ సంక్రాంతిపర్వదినం సకల శుభాలూ
చేకూర్చాలని ఆకాంక్షిస్తూ 

హృదయపూర్వక  సంక్రాంతి  శుభాకాంక్షలతో
మీ శ్రేయోభిలాషి ….నూతక్కి రాఘవేంద్ర రావు
నూతన వత్సర శుభాకాంక్షలు.
స్వాగత వీడ్కోలులు.
రచన : నూతక్క్కి

దుర్భర స్థితిగతుల 2010 కి
వీడ్కోలునందిస్తూ
2011 ను  స్వాగతిస్తూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు.

యుద్ధాలూ,

మానవ హననాలూ,
ఉగ్రవాద విక్రుతాలూ,
మత ద్వేషాలూ ..

ప్రపంచ వ్యాప్తంగానూ…….,

విదేశీ దురాక్రమణ ల
విపరీత ధోరణులూ,
ప్రాంతీయ వేర్పాటు వాదనలు,
జలవనరుల పంపకాల
అసమానలతలు,
అంతర్గత
వైషమ్యభావనలు ,
తీవ్ర వాద వికృత
విన్యాసాలు,
దేశ వ్యాప్తంగానూ……..,
బందులూ, రాస్తారోకోలూ,
ప్రయాణ సాధనాల
ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల
విధ్వంసాలూ
దహనాలూ,దోపిడీలూ,
దొంగతనాలూ,అందోళనలూ,
హంగర్ స్ట్రైక్ లూ
అనారోగ్యాలూ,ఆత్మహత్యలూ,
హత్యలూ,
అత్యాచారాలూ,మానభంగాలూ,
యాసిడు దాడులూ,
యాచకత్వం,దొంగతనాలూ,

లంచాలు,అధికారుల అక్రమాలూ ,
రాజకీయుల అనైతిక విన్యాసాలూ
అధికార,ప్రజా  ధన
దుర్వినియోగాలూ ,
ఆశ్రిత పక్షపాతాలూ ,
దురాగతాలూ,
ప్రాకృతిక ప్రకోపాలూ,
కరువులూ ,వరదలూ
తుఫానులూ,
అన్నదాతల ఆక్రోశాలూ,
భవిష్య నిర్దేశ కత
కాన రాక
యువత పట్టిన  పెడ దారుల
పయనాలూ,
నిరుద్యోగం,
ఆకలి చావులూ ,
బ్రతుకు అగమ్యమై
ఆకలి తీర్చే అన్న దాత
ఆత్మ హత్యలూ,
తనువును  కప్పి శీతో ష్ట్నాలనుంచి
మనిషిని కాపాడేందుకు  బట్టను సృష్టించి
తన తనువును కాపాడుకోలేని
నేతన్నల దుర్మరణాలూ
ఆరుగాలం శ్రమించినా
ఆకలి తీరని అభాగ్య
వ్రుత్తి   జీవుల వేదనలూ …..
ఆకాశాన్నంటి అత్యవసర
నిత్య వినియోగ   సరకుల
ధరలు అందుకోలేక …జన సామాన్యం
ప్రాంతీయంగానూ ….
ఇవేవీ
కానరాని కొంగ్రొత్త సంవత్సరం… ఈ నూత్న వత్సరం 2011 కావాలని ……. శుభ ఆకాంక్షలతో ,
ప్రపంచ మంతటా అన్ని దేశాల ప్రజలకూ తిండీ, గుడ్డా, నీడా, మంచి నీరూ, మంచి గాలీ,నాణ్యమైన….  వైద్య సదుపాయాలూ, ప్రయాణ సదుపాయాలూ,వినోదవనరులూ,,స్త్రీ జాతికి గౌరవం, రక్షణ,శిశువులకు సంరక్షిత ఆహార వైద్య  సంవిధానాలూ,  విద్యార్ధులకు సామాజిక విలువలతో కూడిన ఉచిత  విద్య,  క్రమ శిక్షణ, యువతకు వుపాధి వనరులు, వృద్ధులకు,వికలాంగులకూ  సర్వ  విధాల ఆదరణ,   అందించే ప్రభుత్వాలు….
ప్రపంచ వ్యాప్తంగా  సకల దేశాల ప్రజలకూ లభించేలా  , ప్రజలు  తమదైన భాత్యతలను గుర్తించి   నిర్వర్తించేలా ,ఈ క్రొంగ్రొత్త వత్సరం 2011 ప్రపంచ  వ్యాప్త మానవాళి సంక్షేమాన్ని కాపాడుతుందని ఆకాంక్షిస్తూ ……
భూమాతను తొలచి వొలిచి ధ్వంసం చేసి తమ ఉనికికే ప్రమాదం  తెచ్చుకోకుండా ,భూమాతకు అరుణుని  ఆల్ట్రా వైలట్ కిరాణా లనుండి  రక్షణనందిస్తున్న ఓజోను రక్షణ వలయాన్ని సంరక్షించుకొనే దిశగా చర్యలు తీసుకొంటూ……..,
ప్రక్రుతి అందిస్తున్న సూర్య శక్తి, వాయు శక్తీ, సముద్ర జల శక్తీ,వంటి  భూ బాహ్య వనరులనుండి  శక్తిని గ్రహించి
వినియోగించుకొనే దిశగా శాస్త్ర విజ్ఞాన్ని వినియోగించుకొని ,ముందుకు నడచి ప్రతీ మనిషీ, ఖండాలూ , దేశాలూ, ప్రాంతా లూ ,అనే కుస్చ్చితనిస్చ్చితాలు లేకుండా,తమ హక్కులను వినియోగించుకొనే విధంగా, కుల మత వర్గ భావ  రహితంగా   తోటి మానవుని  మనుగడను    గౌరవించి సహకరించాలని ,తోటి జీవకోటిని సంరక్షించి, తమ మనుగడను కాపాడుతున్నప్రకృతిని చిద్రం చేయకుండా సంరక్షించుకోవాలని ఆకాంక్షిస్తూ,కోపం ఉద్రేకం ఉద్వేగం  వంటి పలు తాపాలను  నియంత్రించు కొని ఆరోగ్యవంతమైన మనసులున్న మనుషులుగా  మానవ సమాజోద్దరణకు,జీవావరణ సంరక్షణకూ  తోడ్పడాలని ఆకాంక్షిస్తూ ఇవే మా నూత్న వత్సర శుభాకాంక్షలు…..నిత్య శ్రేయోభిలాషి …నూతక్కి రాఘవేంద్ర రావు.
దీపావళి పర్వదిన శుభాకాంక్షలు .
ఈ దీపావళి మీ జీవితాలలో భవ్యమైన ఆశావహ  కాంతులు
నింపాలని ఆకాంక్షిస్తూ  బ్లాగ్మిత్రులందరికీ …భవదీయుడు ….
నూతక్కి.
దీపావళి

దీపావళి…. ఎన్నెన్నో బాల్య స్మృతులు

మతాబాల విరి జల్లులా
దీపావళి ….ఎన్నెన్నో మధురోహలు
గిర్రున తిరిగే భూచక్రపు టిరుసులా
దీపావళి .. చిమ్మ చీకటిన సూన్యంలో
నర్తించే విష్ణు చక్రపు విన్యాసంలా
నయగారాల మయూరిలా …
ఆకసానకెగసి జారే  కాంతిపూలు
నయాగరా జలపాతంలా
.చిచ్చుబుడ్లు వెదజల్లిన  జల్లులు
కాకరపూవొత్తుల మాలికలో
పూల పొట్లాలు విరజిమ్మిన
కాంతుల రవ్వలో
దీపావళి రోలు రోకళ్ళు సృష్టించే
శబ్దతరంగాలో
దీవిటీల సయ్యాటల విన్యాసాలో
జెల్లీ ల పితూరీలో
లక్ష్మీ బాంబుల విస్ఫోటాలో
అమవస నిసిలో ఆకసాన
రాకెట్లు సృష్టించే హరివిల్లులో  …
ప్రమిదల వెలుగుల్లో
ప్రమదల ప్రమోదాల
పరవశాలో
పట్టు పరికిణీల
రెపరెపల కాంతుల్లో
కన్నెల కేరింతల రవళులో
చిమ్మ చీకటిన విరిసిన కాంతులు…
విరజిమ్మిన దృశ్య కావ్యమో  …
ప్రమోదాల హేళి   దీపావళి
ప్రమాదాల సహేలి దీపావళి
విజయ దశమి శుభాకాంక్షలు.
హితుడు :నూతక్కి రాఘవేంద్ర రావు
తెలుగు బ్లాగ్మిత్రులు,
సాహితీ హితులు ….

మీకూ,

మీమీ  కుటుంబ సభ్యులందరికీ….. 

విజయదశమి పర్వదినం
మీ జీవితాలలో
అపూర్వ  విజయ దుందుభులు
మ్రోగించాలని అభిలషిస్తూ…
అందిస్తున్నానందుకోండి
నా  హృదయపూర్వక
శుభాకాంక్షలు.

విక్రుతినామ సంవత్సర తెలుగు వుగాది శుభాకాంక్షలు. …నూతక్కి

 (వినమ్రంగా జగతినున్న తెలుగులందరికి ),

తేదీ : 16-03-2010

విరోధినామ వత్సరానికి వీడ్కోలునందిస్తూ,

విక్రుత నామ సంవత్సరాన్ని స్వాగతిస్తూ

 యీ జగతిన వున్న తెలుగులందరికి

 అందిస్తున్నానివే నా హ్రుదయపూర్వక

విక్రుతినామ నూతన వత్సర శుభాకాంక్షలు.

 యీ సందర్భంలొ ……

 విరోధికి వీడ్కోలూ,విక్రుతికి స్వాగతం ….

 విరోధీ!

నీ కఠోర పదఘట్టనలోపడి

నలిగి విరోధాగ్ని జ్వాలలో కనలిన

మా తెలుగుల మదితలపులు

నీ వెంట

 సివారుదాకా వచ్చి నిను

 సాగనింప సిద్ధంగాలేవు.

అయినా వీడ్కోలిస్తూనే

నిను వేడుకొంటున్నాం

వస్తావుకదా! మరో

అరవయేళ్ళకు తప్పక

అప్పటి మా భావి తరాలను

మాత్రం ఇప్పటిలా మము

బాధించినట్లు వేధించకు సుమ్మీ !

విక్రుతీ !….. ఎందుకో

 మావేప చిగుళ్ళకు

 పూగుత్తులు పూయలేదు.

మావిళ్ళ పూతలు మరెందుకనో

 యింకా పిందలుగా మారలేదు.

 చింతపులుపూ సముద్ర

 వుప్పూ ఎరగారమూ

 వ్యాటు బంధనాలలోంచి

 సామాన్యుణ్ణి దరి

చేరలేకున్నాయ్.

 ట్యాపుల్లోఅయిదురోజులకోసారి

 వచ్చే నీటి చుక్క కొరకు

గండు చీమలు క్యూలు

కట్టి నిరీక్షిస్తున్నాయి.

మాదాకా చేరనీయవులే

 షడ్రుచులేమీ లేక

తీర్ధమూ లేక

 నీకు నైవేద్యం

యేమని పెట్టను

దప్పిగొన్నగండుకోయిలల

స్వరాలు బొంగురు పోయివున్నాయి

 నిను స్వాగత గీతాల

స్వాగతించలేని 

అశక్తతలో  

తెలుగు మాగాణపు

తలుపులు తెరచి

 సాష్టాంగప్రణామాల

 నినుస్వాగతిస్తామని

 ఆశించబోకు..

నీ నామంలోని విక్రుతం

 రూపంలొనూ భావనలోనూనా

 మా భావనలోని భావంలోనేనా

 విక్రుతవర్తనివో

సధ్భావామ్రుతవర్షిణివో

 నీపద తాడనలో

 నలిగి నసించి తెలుసుకోవలెనా?

విక్రుతమా నీ కాలి అందియల చప్పుళ్ళు

 కర్ణకఠోర లోహ శబ్దాల్లా కాక

మ్రుధు మధుర మంజీరనాదల్లా

మలచుకొని రా

 నీ పదఘట్టనలో నలుగి పోతున్నా

 కాలి గజ్జెల రవళి లో మైమర చైనా

మేం కిమ్మనం

 ఆకారం నీదెలా వున్నారా

 మాదగ్గర మేకప్ పార్కులు

 చాలానే వున్నాయి

 మేం స్వాగతించేంత

సుందరంగా తయారై వచ్చేయ్

 నీ మనసు ఎంత విక్రుతమైనా

మా రాజకీయ నాయకుల ముఖాల్లా

ముఖాన టెంపరరీ చిరునవ్వు ముసుగేసుకొనైనా

 మేం స్వాగతించేలా తయారై వచ్చెయ్

 ఆకారానికీ, అధికారానికీ,

ఆర్ధిక సంపన్నతకూ ఆడంబరాలకూ,

 ఆర్భాటాలకూ, భేషజాలకూ

 దాసోహమయి  

వున్నాం

మేము … తప్పక స్వాగతిస్తాం.

NEW YEAR GREETINGS
 
Here’s
 
Wishing you
 
HAPPY NEW YEAR 2010 TO ALL OF YOU.
Happiness prosperity
and
good time to last all year
 

//

Nutakki Raghavendra Rao & Manoharam
 
దసరా శుభాకాంక్షలు

 

From:నూతక్కి రాఘవేంద్ర రావు28-09

-2009తెలుగు బ్లాగ్ మిత్రులు

కవులూ రచయితలూ రచియిత్రులూ

చదువరులు వీక్షకులూ

వ్యాక్య్యాతలూ,విశ్లేషకులూ

తెలుగువారూ, భారతీయులూ

ఎక్కడున్నా

అందుకోండి యివే నా

హ్రుదయపూర్వక

దసరా శుభాకాంక్షలు.

తెలుగు వారు ఎక్కడున్నా

ప్రుధ్వీ తలాన ఎచ్చోటనైన

ఎదగాలి గౌరవముగ

నిలవాలి శిరమెత్తుక

నిలుపాలి మీ ఖ్యాతి

భువన గోచరముగ