యాభై మూడేళ్ళు
రచన :నూతక్కి
తేది: 15-02-2010.
రాష్ట్ర విభజన అనేక పీట ముడులతో, సంక్లిష్టతతో కూడుకొన్న అంశం. ఆనాడు అప్పటి గౌ.ప్రధాని జవహర్లాల్ నెహ్రూ,తెలంగాణాప్రాంతాన్ని,ఆంధ్ర రాష్త్రంతో కలిపాలని చేసిన అనాలోచిత నిర్ణయం వల్ల, వుత్పన్నమయిన పరిణామాలకు, యీనాటికీ. నెత్తి పట్టుకు కూర్చుని పరిష్కారం చేయకుండా తాత్సారం చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మనం ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతున్న కోర్కెకు అవతలి పక్షం లేవనెత్తుతున్న అభ్యంతరాలలో వున్న న్యాయబద్ధ అంశాలు పరిగణనలోకి తీసుకొని యోచిస్తూ సమన్వయంతో,సమ్యమనం పాటిస్తూ ముందుకు సాగవలసింది పోయి దురుసు రీతులతో వుద్యమ నాయకులు సంక్లిష్టతను స్రుష్టిస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో మనం మన ఆకాంక్షలకు ఎంత ప్రాధాన్యం మిస్తున్నామో, అవతల వారి వుద్దేశ్యాలకూ విలువలు వుంటాయనేది గమనించ వలసిన విషయం. , మన అభిలాషలకు అనుకూలంగా పరిణామాలు లేకుంటే విధ్వంస పూరిత వుద్యమాలు , ఏకపక్ష విస్ఛిన్న పోకడలు ప్రోత్సహించడం సోచనీయం.చర్చల ద్వారానో మధ్యవర్తుల ద్వారానోసమస్య పరిష్కారానికి అవకాశమే లేని విధంగా అవతలి ద్వారాలను తామే మూసివేసుకొంటున్నారు.
అటు తమిళులూ యిటు తెలంగాణీయులూ “తకిట తకిట తక్ తధోమ్” అంటూ ఆంధ్రులను “మ్రుదంగం” చేసి వాయించారు. యిప్పుడూ అదే పనిలో వున్నారు. .కేంద్రం ఆంధ్రను ఫుట్బాల్ అనుకొంటోంది.తనఆటకొరకు ఆంధ్రులను బంతిలాఎడాపెడా తంతోంది.
నిజాము పరిపాలనలో పాలకుల వివక్షత వల్ల తాము కోల్పోయిన వ్యక్తిత్వావికాసానికీ, పొందలేకపోయిన అక్షరాశ్యతకూ,తద్వారా కోల్పోయిన వుపాధి అవకాశాలకూ భూసంపదకూ, అన్నింటికీ ఆంద్ర ప్రజలను , ఆంధ్ర ప్రాంత పాలకులను,భాద్యులను చేసి దుర్భాషలాడుతూ,యువతలో ఆంధ్రుల యడల అకారణ ద్వేషాగ్నిని రగుల్చుతున్న రాజకీయవేర్పాటు వాదుల విధాన శైలి గర్హనీయం.బాధాకరం..
యీ విషయంలో వేర్పాటు వాద యువకుల ఆవేదన ఆందోళన త్రుటిలో పరిష్కారం అయ్యేదికాదు. విభజనా వాంఛ అవతలి వారి మౌలిక ప్రయోజనాలకు,హక్కులకు, విఘాతం కలిగించే విధంగా వున్నఫ్ఫుడు, దానిని నెరవేర్చడం వల్ల దేశంలో యితర ప్రాంతాలలోనూవిభజనా భావ విస్పోటనలు వుధ్భవిస్తాయనుకున్నప్పుడు దేశ సమైక్యతకూ,,సమగ్రతకూ,సుహ్రుధ్భావ వాతావరణానికీ భంగం కలగని రీతిలో నిర్ణయం తీసుకోవడం కేంద్ర ప్రభుత్వ భాద్యత.
అది చిటికెలో జరిగే పని కాదు. ” వేర్పాటు పడాలనీ ,స్వయం పాలన కావాలనీ, మా యాభై సంవత్సరాల కోరిక….యిది మా ఆత్మ గౌరవ సమస్య..”.. తెలంగాణ వేర్పాటువాదుల వాదన….. సమైక్యంగా వుండాలనేందుకు వుత్తరాంధ్ర,సీమాంధ్ర ప్రాంతీయులు, న్యాయమైన ఒక్క పాయింటు నైనా చెప్ప మనండి అని వేర్పాటు వాదులు అక్కసుగా అడిగే ప్రశ్న.
వుత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర, రాయల సీమ ప్రజలకూ …ఆత్మ, గౌరవం వుంటుందికదా.వారికీ న్యాయబద్ధమైన కోరికలు సమైఖ్య రాష్ట్ర పౌరులుగా వారి హక్కులు ఎవరూ కాదన లేనివికదా!. సమైక్య రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వుండాలన్న వారి కోరికలో న్యాయబద్ధ కారణాలు అనేకం వారూ చెప్ప వచ్చు కదా?
అందులో కొన్ని….. మద్రాసు రాష్ట్రం నుండి విడివడి, స్వంత రాజధాని నగరాన్ని అభివ్రుద్ధి చేసుకొనే దశలో,రాజకీయ జిమ్మిక్కుల వల్ల రాజధానినీ, హైకోర్టునూ త్యజించి తమ వునికిని పోగొట్టుకొని, సరిపెట్టుకొని,…. హైద్రాబాద్ నగరంలో ఎన్ని విధాల త్రుణీకారాలు ఎదురైనా సహిస్తూ, అదే తమ రాజధాని నగరమని మనసా భావించి ఆ నగరంతో అనుబంధాన్ని పెంచుకొని, గతయాభై యేళ్ళ నుండీ సమైక్య ఆంధ్ర ప్రదేశ్ నినాదం తోనే వున్నారు,వుత్తరాంధ్ర,కోస్తాంధ్ర, సీమాంధ్రులు. వారిదీ తెలంగాణియుల వాదనంత పాతదే కదా.
వాస్త వానికి ఆంధ్రులు తెలంగాణాతో కలవకుండా వుండి వుంటే ..నెహ్రూ జిమ్మిక్కులలో చిక్కడి వుండకపోతే… వారు యీసరికి,గడచిన యాభై మూడు సంవత్సరాల కాలంలో…ఎంతో సాధించుకొని వుండేవారు.
1) రాజధానిగా ఒక ప్రణాళికా బద్ధమైన ఒక మహత్తర సుందర నగరాన్ని సకల హంగులతో నిర్మించుకొని వుండి వుండే వారు. 2) పారిశ్రామిక అభివ్రుద్ధిని సాధించుకొని వుండి వుండేవారు.
3) లక్షలాది మందికి వుపాధి నిచ్చే సినిమా పరిశ్రమ,…. నిరంతర భయ భ్రాంతులతో బ్రతుకు వెళ్ళదీస్తున్నతెలుగు సినిమా పరిశ్రమ… యీ సరికి యీ యాభై యేళ్ళలో తనదని సగర్వంగా,సగౌరవంగా చెప్పుకొనే ఓ శాశ్వత చిరునామా పొంది వుండేది.
4) యీ యాభై మూడు సంవత్సరాల కాలంలో………రాజధాని హైదరాబాద్ నగర అభివ్రుద్ధి నిర్మాణంలో, పరిశ్రమలూ,విద్య, వైద్య,పారిశ్రామిక, ,చలన చిత్ర, నివాస గ్రుహనిర్మాణ ,వుపాధి రంగాలలో,సాఫ్ట్ వేర్ రంగంలో, …యిలా ఎన్నింటిలోనో ….. అభివ్రుద్ధి పరచి,యాభై మూడేళ్ళ సమయాన్ని, ధనాన్ని శ్రమను వ్రుధా పరిచామా ?,బూడిదలో పోసిన పన్నీరు చందంగా చేశామా అన్న ఆవేదన. ….
తెలంగాణీయుల కన్న ఎక్కువ మానసిక అనుబంధాన్ని,ఎమోషనల్ భాందవ్యాన్ని హైద్రాబాదుతో పెంచుకున్న.వుత్తరాంధ్ర,సీమాంధ్ర,కోస్తాఆంధ్ర ప్రజలు……. హైద్రాబాద్ మాది అని తెలంగాణీయులు అన్నప్పుడల్లా, భయ భ్రాంతులవుతూ కూడా , హైద్రాబాద్ తో వున్నఎమోషనల్ భాందవ్యాన్ని, తెంచుకోవడానికి, ,సిద్ధంగాలేరు.
యాభై సంవత్సరాల తమ వంతు శ్రమ ,ధనాదుల త్యాగ ఫలాలను, కోల్పోవడానికి కూడాఆంధ్రులు సిద్ధంగా లేరు.
5) వుమ్మడి ఆర్ధిక వనరులతో పారిశ్రామిక నగరంగా కేంద్రీక్రుతమైన,కేంద్ర రంగ భారీ పరిశ్రమల హబ్ గా మారిన పూర్ణ కుంభం హైద్రాబాద్ తో సహా తెలెంగాణ విడిపోవడానికి వుత్తరాంధ్ర కోస్తా సీమ ప్రజలు అంగీకరించరు.
6) తమ భవిష్యత్తరాలకు పారిశ్రామిక వుపాధి దొరకని శూన్య రాష్ట్రాన్నిఅందించేందుకు ఆంధ్రులు సిద్ధంగా లేరు.
7) గడచిన యాభై మూడుసంవత్సరాలలో రాష్ట్ర ప్రజల వుపాధి అవసరాల కనుగుణంగా పారిశ్రామిక అభివ్రుద్ధిని విస్త్రుత పరుచుకొని వుండేవాళ్ళు. తమ రాష్ట్రం యధాతధంగా వుండి వుంటే తమ రాష్ట్రంలో భారీ పరిశ్రమలు స్థాపించుకొని అన్నిప్రాంతాలు పారిశ్రామికంగా సర్వతోముఖాభివ్రుద్ధి చెందేలా, దేశంలోనే, మహోన్నత పారిశ్రామిక విప్లవం సాధించి వుండేవారు.
8) తమ వంతు శ్రమ ధనం నిష్కల్మష నిబద్ధతతో వడ్డించిన విస్తరిలా తీర్చి దిద్దిన,యాభై సంవత్సరాల ప్రగతి ఫలాలు,శ్రమ ఫలితాలను, తామొక్కరే స్వంతం చేసుకోవాలన్న దురాశతో తెలంగాణ వుద్యమ కారులు, రాష్త్రంలోని యేకైక పారిశ్రామిక కేంద్రీక్రుత ప్రాంతాన్ని తన్నుకు పోదామని చూస్తున్న యీ తరుణంలోఆంధ్ర ప్రదేశ్ రాజధాని,పారిశ్రామిక, వాణిజ్య రాజధాని అయిన హైద్రాబాద్ నగరాన్ని వదులుకోవడానికి వుత్తరాంధ్ర, సీమాంధ్ర ప్రజలు సిద్ధంగా లేరు. అందుకే విభజనలో రాజధాని హైద్రాబాద్ నగరం,నగర పారిశ్రామికీకరణ, కీలక అంశాలుగాపరిగణనలోకి వస్తాయి… ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
అప్పటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వాలు, వుత్తర సీమాంధ్ర ప్రాంతాలలోనూ, హైద్రాబాద్ కు దీటుగా ,నగరాల అభివ్రుద్ధిని,ప్రోత్సహించి వుంటె,భారీపారిశ్రమలు,విద్య ఆరోగ్య్య గ్రుహ నిర్మాణ,పరిశోధనా రంగాలను అభివ్రుద్ధి పరచి వుపాధికి మార్గ నిర్మాణం చేసి వుండి వుంటే, ….
గ్రేటర్ హైద్రాబాద్ నగరం వుమ్మడి రాజధానిగా వుండాలని గాని, సమైఖ్య ఆంధ్ర ప్రదేశ్ గా అవిభాజితంగా వుండాలనిగాని, వారు పట్టు బట్టి వుండే వారు కాదేమో.
వారి ఆందోళనను ఇప్పటికైనా సహ్రుదయంతో అర్ధం చేసుకొని, పైన తెలిపిన అంశాలు కీలక అంశంగా భావించి స్రుహ్రుధ్బావ వాతావరణంలో అర్ధం చేసు కొని, పరిష్కార మార్గాలు వెదకడం ఒక్కటే ప్రస్తుత సమస్యకు పరిష్కార మార్గం.
యీ భారీ పరిశ్రమలూ,కార్యాలయాలూ, పరిశోధనాలయాలూ ఆనాడే స్థాపనా దశలోనే అన్ని జిల్లాలకూ ఒకటో రెండో చొప్పున విభజించి స్థాపించి వుండి వుంటే అసలు తెలంగాణ రాష్ట్ర నినాదమే వచ్చేది కాదేమో.
పరిశ్రమల కేంద్రీకరణలో జరిగిన అనాలోచిత చర్యలు, వెనుకకు తీసుకోలేని తప్పిదాలే, అది ఎన్నడు జరిగినా, ఎవరు చేసినదైనా….. ప్రస్తుత తరుణంలో ఆ పరిశ్రమలను ముక్కలుగా విభజించి ఎవరి వంతు వారి ప్రాంతానికి తరలించలేము కాబట్టి,యితర ప్రాంతాలలోనూ అంత స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పారిశ్రామికీకరణ అమలు జరిపి ,జరగబోయే క్రమంలో తప్పిదాలు జరుగకుండా,యే ప్రాంతానికీ వివక్షత జరగకుండా సమన్యాయ పరిష్కారం లభించి అన్నదమ్ముల్లా విడి పోవడం న్యాయం
కాని,యితర ప్రాంతీయుల న్యాయమైన హక్కులను హైజాక్ చేయాలనుకోవడం విద్రోహపూరిత కుట్ర గా భావించ వలసి వస్తుంది…
ఈ క్రమంలో యువకులు ప్రాణ త్యాగాలు చేయకుండా సమస్య పరిష్కారాని కి శాంతియుత మార్గంలో చేయవలసిన త్యాగమార్గాలు అనేకం వున్నాయి. యిచ్చి పుచ్చుకొనే రీతిలో కూడ త్యాగాలు చేయవచ్చు. వివేకంతో .వ్యవహరిస్తే విగ్నత..
ఇక పోతే, సరిహద్దుకు ఎంతో దూరంలో వున్న నగరం రాజధాని నగరంగా వుమ్మడిగా ఎలా సాధ్యమో అని కొందరి మిత్రుల సంశయం. ఆ కాలంలోభాగ్యనగరానికి ఎన్నో మైళ్ళ దూరంలోవున్న , అప్పటికి విదేశీ ప్రాంతమైన బందరు రేవు నుండి, ఎగుమతులు దిగుమతుల కొరకు ఎడ్ల బండ్ల పై రవాణా నిర్వహించిన నిజాం, అందులకై ఆంగ్లేయ ప్రభుత్వంతొ తాత్కాలిక ఒప్పందాలు కుదుర్చుకున్నాడు.. అదే మార్గంలొ ఆంధ్ర ప్రాంతం నుండి నిత్యావసర ఆహార పదార్ధాలూ దిగుమతి చేసుకొనే వాడు.,
కాబట్టి గ్రేటర్ హైద్రాబాద్ నగరం ,వుత్తరాంధ్ర సీమాంధ్రులకు, ఆ రోజునా, యీ రోజునా అంతే దూరం, రేపూ అంతే దూరంలో వుంటుంది. వుమ్మడి రాజధానిగా వినియోగించుకోవడానికి అదేమీ అభ్యంతరకరం కానక్కర లేదు.
మరో రాజధానిని నిర్మించుకొనేందుకు, సమూలంగా జరుగవలసిన పారిశ్రామికీకరణ కు కలిగే ఆర్ధిక భారం యిటు తెలంగాణ భరించినా, అటు కేంద్రం భరించినా ఎంతో సమయంతో కూడిన వ్యవహారం…
ప్రస్తుత తరుణంలో దాయాదుల పోరువల్ల నూతన రాజధాని నిర్మాణానికి అయ్యే వ్యయం,పారిశ్రామికీకరణకు అయ్యే వ్యయం, విద్యా వైద్య రంగాల్లో వున్న వ్యత్యాసాలు సరి చేసేందుకయ్యే వ్యయం,కేంద్రమో ,యేర్పడబోయే తెలంగాణ రాష్ట్రమో భరించాల్సి వుంటుంది. అవన్నీ పూర్తయ్యేంత వరకూ, పారిశ్రామికీకరణ పూర్తయ్యేంత వరకూ, హైద్రాబాద్ నగరమే సీమాంధ్రులకూ రాజధానిగా వుంచాల్సిన అవసరం వుంటుంది.అది సాధ్యం కాదనుకున్న తరుణంలో వుమ్మడి రాజధానిగా గ్రేటర్ హైద్రాబాద్ ను ఎట్టి వివక్షతా చూపకుండా వుమ్మడి రాజధానిగా అంగీకరించి తీరాలి.
ఒక లక్ష్యం సాధించాలనుకొనే వాడు, మౌలిక లక్ష్య సాధనకై కొన్నింటిని కోల్పోవలసి వచ్చినా సిద్ధపడటమన్నది విగ్నత. రాజధాని నగరాభివ్రుద్ధిలో, అన్ని రంగాలలో , ఆంధ్రులూ తమ వంతు శక్తి, యుక్తులనూ, శ్రమ ధనాదులనూ ఒడ్డి , వడ్డించిన విస్తరిలా ,నగరాన్ని తీర్చి దిద్దిన తరుణంలో అన్ని రంగాలలోఅభివ్రుద్ధి చెందిన ప్రదేశంగా ప్రపంచంలొ పేరు ప్రఖ్యాతులు పొందిన రాష్ట్రం, ముక్కలుగా విడిపోవడం,బాధాకరమే…….సమైక్య ఆంధ్ర ప్రదేశ్ అఖండంగా కొనసాగాలని సమైక్యవాదిగా యీనాటికీ నా ఆకాంక్ష.