saahitee sadassulu


ఫొటొ: గిజిగాడిది.

తేది: 14-06-2009
సమావేశ స్థలి:

శ్రీ క్రిష్ణకాంత్ పార్క్..

ఇ తెలుగు

సమావేశం .

E, Telugu  e.commitee meet on dt.14-06-2009

.యీ ఫోటోలో వున్నవారు..

ఎడమనుండి కుడికి

మొదటి వారి పేరు గుర్తులేదు

 శ్రీ తుమ్మల శిరీష్ కుమార్.

శ్రీ దాట్ల శ్రీనివాస రాజు.,

శ్రీకత్తి మకేష్ కుమార్,

శ్రీ క్రిష్ణకాంత్ పార్క్ లో విరిసిన సాహితీ సుమాలు తో గిజిగాడు లేని ఫొటొ….

ఇ.తెలుగు సమావేశం,మరి కొన్ని చిత్రాల్లో మరోటి
          శ్రీ క్రిష్ణకాంత్ పార్క్ లో విరిసిన సాహితీ సుమాలు

కెమెరాగిజిగాడు.

తేది: 14-06-2009
 శ్రీ క్రిష్ణకాంత్ పార్క్
లో జరిగినఇ తెలుగుసమావేశం .  

సమావేశ స్థలి: శ్రీ క్రిష్ణకాంత్ పార్క్.

దూర్వాసులవారేదో వివరిస్తుంటే ,…..

శ్రీ వీవెను కు తుమ్మలవారికీ మధ్యనున్న వారి పేరు మరిచాను,తెలిసిన వారు చెప్పండి.

శ్రీ క్రిష్ణకాంత్ పార్క్ లో విరిసిన సాహితీ సుమాల తో గిజిగాడు

కెమెరా : గిజిగాడిది.

తేది: 14-06-2009 

సమావేశం లో పాల్గొన్న

అతిరధ సాహితీ వేత్తలు,

ప్రముఖ బ్లాగర్లతో గిజిగాడు.

ఎడమ నుండి కుడికి :

శ్రీయుతులు

తుమ్మల శిరీష్ కుమార్,  దాట్ల శ్రీనివాస రాజు, కత్తి మహేష్ కుమార్, కశ్యప్, శ్రీనివాస్ (సమీహ )- http://sameehatelugu.blogspot.com), పద్మనాభం దూర్వాసుల (తెలుగు గ్రీటింగ్స్ ),వీవెన్, మరియు గిజిగాడు

శ్రీ కిరణ్ సాంస్క్రుతిక సమాఖ్య , వారి కార్యక్రమం.

రచన: నూతక్కి రాఘవేంద్ర రావు. తేది:02-10-2009

శ్రీ కిరణ్ సాంస్క్రుతిక సమాఖ్య (కల్యాణ్ నగర్,ఈస్ట్ ఆనంద్ భాగ్,మల్కాజ్ గిరి,) వ్యవస్తాపక అధ్యక్షుకులు శ్రీ లంకా వెంకట సుభ్రహ్మణ్యం గారి ఆహ్వానం పై ,తేదీ 02-11-2009 న డా.ఎయస్.రావ్ నగర్ లో సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ అసొసియేషన్ సౌజన్యంతో డా.ఏ.ఎస్ రావు నగర్ లో( స్.సి.వె.ఎ) వారి వేదికపై , కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన….. “భారతీయసంస్క్రుతి మూల సూత్రాలు” అనే అంశంపై చారిత్రక నవలా చక్రవర్తి డా.ముదుగొండ శివప్రసాద్ గారి ప్రసంగం విందామని వెళ్ళడం జరిగింది. శ్రీ ముదిగొండ వారు, నిర్ణీత సమయానికే సభాస్తలికి విచ్చేశారు కాని ,సభకు అద్యక్షత వహించవలసిన దూరదర్శన్,ప్రోగ్రాం ఎక్సిక్యుటివ్ శ్రీ డా.ఓలేటి పార్వతీశం గారి ఆగమన విలంబనతో సభ కొంచెం లేటు గా ప్రారంభమైనా…..ఆద్యంతం అత్యధ్భుతంగా కొనసాగింది. ఓలేటి వారి ప్రసంగం సెలయేటి గలగలలా ,ఓ చిరు జల్లులా వుంటే,ముదిగొండవారి ప్రసంగం వుద్రుత జలపాతపు హోరులా,మహోద్రుత గంగా ప్రవాహంలా కొనసాగి ఆద్యంతమూ ప్రేక్షకులను కట్టి పడేసింది.ఆయన ప్రసంగం వినడం, విని ఆనందించడం మరచి పోలేని అనుభూతికి లోను చేసింది. ముది గొండవారు, అతి సామాన్యంగా,అతి సామాన్య దుస్తుల్లో నిరాడంబరంగా… చూపరులకు ఒ అతి సామాన్యునిలా కనిపించినా,ఆయనలో సమ్మోహన పరచే వాగ్ధాటి,అబ్బుర పరిచే విషయ పరిగ్నానం…….ప్రేక్షకులను ఎన్ని గంటలైనా కుర్చీలకు కట్టిపడేశాయి. ప్రపంచంలోనే మహోత్క్రుష్టమైన భారతీయ సంస్క్రుతి, దాని మూలాలు, మూల్యాలు, ఔన్నత్యాల, గూర్చిప్రసంగిస్తూ,ప్రస్తుత స్తితిగతులగురించి అనర్గళంగా సోదాహరణంగా వివరించారు. మారుతున్న సామాజిక స్తితి గతులలో చిద్రమౌతున్న భారతీయ సంస్క్రుతీ విలువలను,పరి రక్షించుకోవలసిన ఆవస్యకతను వివరించారు. వయోవ్రుద్ధులు, గ్నానసమ్రుధులనుండి సమాజం తెలుసుకోవల్సింది, నేర్చుకోవలసింది ఎంతో వుందని, వారి అపార అనుభవాన్ని,యువత గ్రహించి లబ్ధి పొంది ఆ సారాన్ని, భారతీయ సంస్క్రుతీ పరి రక్షణకై ,వికాసాని కై, వినియోగించి భావి తరాలకు యీ దిశగా మార్గదర్శకత్వం వహించాలని విన్నవించారు. సభా ప్రారంభం… కుమారి లలిత తన సుస్వర గాత్రం తో పాడిన లలిత గీతం తో ప్రారంభమై, శ్రీ నూతక్కి రాఘవేంద్ర రావు గారు (కవులు, మరియు బ్లాగ్ లోకంలో మునుముందుకు సాగిపోతున్న ,తెలుగు బ్లాగర్ http://www.nutakki.wordpress.com,నిర్వాహకులు) మరియు వుషారాణి గారు,డా.సునీత గారు,రామ మోహన రావు గారు, తమ కవితలతో సభను అలరించారు. శ్రీఅచ్యుతరామ రాజు గారు చదివి వినిపించిన ఆటవెలదులు, సామాజిక విలువలపై వెలువరించిన వ్యక్తీకరణ అధ్భుతం..అక్కి రాజు రమాపతి రావు గారు తమ అధ్భుత గాత్రం తొ పౌరాణిక పద్యాలతో సభను అలరించారు. సభకు క్రుతగ్నతలు సమర్పిస్తూ సభా నిర్వాహకులు శ్రీ లంకా సుభ్ర్హ్మణ్యం గారు,తమ సహధర్మచరిణి సంపూర్ణ సహకారం వల్ల తన సాహితీ వ్యాసంగం, సభా నిర్వహణ కార్యక్రమాలు నిర్వర్తించుకో గలుగు తున్నానని తెలిపారు., తన ప్రియ మిత్రులు, సన్నిహితులు , శ్రీ విజయకుమార్ గారి సంపూర్ణ సహకారం లభించడం వల్ల యీ సభను యీ రీతిన దిగ్విజయం చేసుకోగలిగానని క్రుతగ్నతలు తెలియబరచారు.శ్రీమతి లంకా సుబ్రఃమణ్యం గారి వందన సమర్పణతో సభ ముగిసింది.