satti gaadi kaburlu


తెనుగేడ బతుకుతాందొ నీగ్గిట్ల ఎరికేనా సారూ?
నంజెప్ప మంటవా ?

నీ కాల్మొక్త దొరా, యీడ నాకు సమజ్కాకుంట సాన యిసయాలున్నై. ఇసయం ఒకటి ఎప్పటినుందో నా దమాక్ల బేజ తినేతేస్తా వుండె.
అసల్ తెలుగుకేదో అయిపొతా వుందనేవోల్లంతా ఒకా పారయినా సోంచాయించిన్రా అని?ఎందుకు యెందుగ్గట్లాయె నని సొంచాయించిన్రా అట్లగని అంటున్న? అయ్యింది? సరే ,గెట్లయ్యింది?ఎవురు సేసిన్రు? అమ్మ బాబులు సేసిన్రా?పెబుత్వం సేస్తున్నదా?కార్పొరేటు ఇసుకూలోల్లు జేస్త్తున్నరా?
గివేవి తెల్వకుంటనే ఊకె లొల్లి పెడత రేంది?తెలుక్కేదో గెత్లనొ అయ్యిందని?.
ఇంజినీరింగు సదివెటోడు,అయ్యెయస్ సదివెటోడు,దాక్టేరు సదివెటోడు,అందరు ఇంగ్లీసులనే సదువ్తున్నరాయె ఆకర్కి గుమాస్తగిరి సేసేటొనికి కూడ ఇంగ్లీసు గిత్ల రాకుంటె నద్వదాయె..రాస్త్రమంత ,వుద్దోగులు ఇంగిలీసు ల మాట్టాడ్తిరిరాయె, ఉద్దేగాల ఇంతెర్వూల్లొ ఇంగిలీసేనాయె ,
గసలేందతె సారూ,పెబుత్తానికేమొ గసల్ గదే లేకపొయె .సదూ కొనేతోల్లేం జెస్తరు?
వుద్దేగాలేం జేస్తరు?పాపం ఆల్లది,ఆల్లమ్మ బాబుల్ది తప్పేందందుల?సివర్కి ఒ ముక్క సెబుత సారూ గదేందంటె సారూ… యింకా జర తెనుగుని , గదే మంచో సెడో గానీ సారూ, తెనుగు తీ వీ లు బతికిస్తన్నయ్ సారూ.. యీ లొల్లి పెట్టెటోల్లు గాల్ల పొరగాల్లని తెలుగే నేరుసుకోమని ఎంతమంది తన్నుకులాడుతున్నరు, తెలుక్కోసానికి పెబుత్వంతో పొరుతున్నరు ?

నిజెంగ సెప్పాలంతె సారూ, తెలుగు బతికే దేడ్నో సెప్పాల్నా సారూ నీవు మన్న్స్కు గిట్ల తీస్కో
కుండుండాలె .సెప్ప మంటవ సారూ…..
తెనుగు బదికెడిది గుడిసెల్ల , మల్ల తెనుగు బతికెదిది సదువు రానోల్ల తాన,తెనుగు బతికేడిది, సదువు ఎగ్గొత్తినోల్ల తాన. ఆల్లే సారూ తెనుగు ,తేనె లెక్క తెనుగు మాట్టాడతాన్రు.
బంగలాల సూడు పోన్రి ,తెనుగేడ్నయిన ఇనిపిస్తదేమొ,

అమ్మొ ,గిదంత పెబుత్తం,గిన, పెతిపచ్చాలు గిన యింటే దేసంల తెనుగు బతకాల్నంతె రాస్త్రంల వున్నోల్లందర్కి గుదిసెలుందాల్ననియీ ఎన్నికల పెనాలికల్లో గత్ల పెత్తగల్రు. సారూ…..గంద్కె కింద మీన మూస్కుంత…..నమస్తే కాల్మొక బాంచన్ దొర….అగ్నానిగాన్ని…రచన:నూతక్కి రాఘవేంద్ర రావు, తేది:07-మర్-2009


తేనె పట్టు పై దాడి జర్గు తుంది అని తేనె టీ గలు భావించి నప్పుడు అవి రక్షణ వలయాన్ని సృష్టించుకొనే యత్నం లో ఆందోళనతో తమను తాము పోరాటానికి సిద్ధం చేసుకొనే ప్రయత్నం …….. కవి వూహల్లో
కదలి రండి కదలి రండి
కడలి తరంగాల్లా
రండి బాబోయ్ రండి
త్వర త్వరగా రండి
సాయుధులై పరిగెత్తుక రండి రండి రండి
నెలలపాటు కట్టుకున్న
మనగూటిని కాపడుకొందాం
పూలనడిగి తెచ్చుకొన్న
తెచ్చుకొని దాచుకున్న
పూదేనియ దోచేందుకు
దొంగలమ్మో దొంగలు రండి రండి రండి !!
ముసుగేసుకు వస్తున్నరు
భయం వద్దు ధైర్యంగా
రండి రండి రండి
కుట్టి కుట్టి కుట్టి
వెంటపడి తరిమి కొట్టి
దాచుకున్న తెనేనంత
ఆ శత్రు మూక కింత కూడా
దక్కకుండా చూద్దాం
మనమే తాగేద్దాం రండి !!! రండి రండి రండి !!
మంట చేత బట్టి వారు
మన నెలవు కాల్చ జూస్తున్నరు
మనలను మాడ్చివేయ జూస్తున్నరు, రండి రండి రండి !!
బేల తనం వదలండి పిరికితనం మానండి
ముక్కులకు పదును పెట్టి విషం తోటి కుట్టేందుకు
రండి రండి వేవేగం పరుగెత్తి మీరు
కట్టే చేత బట్టి మనల తరిమి కొట్ట బోతున్నరు
మనలను చంపివేయ జూస్తున్నరు రండి రండి రండి !!!
వీరులారా ధీరులారా వెనుదిరగక పోరాడ రండి
శత్రు మూక ……..మన చెంతకు
చేరక ముందే మనమంతా
నలువైపుల చుట్టముట్టి
దాడి చేసి కుట్టాలే
కుట్టి కుట్టి కుట్టి
తరిమి తరిమి కొట్టాలె రండి రండి రండి !!!

రచన : నూతక్కి రాఘవేంద్ర రావు , తేది:౦౬-౦౨-౨౦౦౯.