యువతా జాతి భవితా మేలుకో .
 
ప్రజాస్వామ్యం లొ
 
పన్నాగాలు పడగలెత్తి 
 
కాటేసేందుకు బుసకొడుతున్న వేళ   
 
నిర్లిప్తత నిరాసక్తత  వీడి
 
కళ్ళు తెరిచి కాచుకో  
 

కోట్లాది ప్రజల జీవితాలు 

ఫణంగా పెట్టి తెచ్చిన 

లక్షలకోట్ల ప్రపంచ  బ్యాంకు

అప్పు లు ,

పన్నుల రూపం లొ ప్రజలు కడుతున్నతప్పు  

సేజ్జుల పేర 

కోట్లాది ఎకరాల ప్రజల

ప్రభుత్వ  భూములు ,
 
ప్రజలిచ్చిన అధికారం బలం తో

అప్పనంగా

దోచుకున్న అదినాధులు .


పీల్చే గాలినీ దోచేసుకున్నారు. 

గుక్కెడు నీళ్ళూ నీకు దక్కకుండా 

కుట్రలు పన్నుతున్నారు 

మనకేంటని నిమ్మకు

నీరెత్తినట్లు కూర్చున్నావు .

నీవు చేయని అప్పు నీవె తీర్చాలని 

మరిచావా, వెట్టికి తల ఒగ్గావా 

పెరిగిన పెట్రోలు ధరలూ,

పెరిగిన యింటి పన్నులూ
 
ఆకసాన్నంటిన 

దినవారీ సరకుల ధరలూ

రవాణా  చార్జీలు
 
వైద్యం ఖర్చులు 

అందలం దక్కించుకొన్న 

ప్రజా ప్రతినిధులు 

అధికారం చిక్కిందే అదనుగా 
 
అంతా చక్కబెట్టుకుని   

ప్రజల సొమ్ము దిగమింగిన
 
ప్రజా ద్రోహులు 
 
అతీగతీ లేకుండా చిద్రం 
 
అధికార దాహంలో 
 
సుపుత్రులు 
 
అక్రమ సంపాదన 
 
కాపాడుకొనేందుకు .
 
భావి యువ జీవితాలను

నిర్వీర్యం చేసే కుట్రల  ప్రణాళికలు 

సాగి పోతున్నాయి. 
 

 
యువతా జాతి భవితా మేలుకో .
 
ప్రజాస్వామ్యం లొ
 
పన్నాగాలు పడగలెత్తి 
 
కాటేసే వేళ కళ్ళు తెరిచి కాచుకో 
 
అక్షర శిల్పి. 
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు. 
 
అక్కడ ఎన్నో 
మూస లు 
వైవిధ్య మై  
అతడు మూసలు 
తయారు చేయడు
వాటిని
వినియోగిస్తాడు 

కావాలనుకున్న 
మూసలో 
వలసిన  పదార్ధం  

వేసి
కూర్చి  విడ దీసి   
ఆ మూసనుంచి  వెలికి వచ్చే 
బొమ్మలు అన్నీ ఒకే తీరు
ముక్కు  కళ్ళు చెవులు తల 
ఎట్సెట్రా ఎట్సెట్రా 
ఒక్కో మూసనుంచి 
ఒక్కో ఆకృతి 
కవితో! కధో ! నవలో! 
అతడు అక్షర శిల్పి 
భావకుడు 
అక్షరం    
పదమై  
వాక్యమై 
భావనలే 
వర్ణ రంజితమై 
పొందిన సొబగులు 
కూర్చిన  తీరులు …
నిపుణత లై .
వెరసి 
కవి చాతుర్యమై 
 
 …………………..

నా చిన్ననాట 

ఆముదం దీపాలు …

ప్రమిదలలో

చేనులో పండిన

ఆముదాలతో 

గానుగాడిన 

ఆముదం 

పెరటి చెట్టు 

దూది ఒత్తి 

అగ్గి పుల్ల 

వెలిగించిన 

దీపాల చెంత 

దిద్దిన అక్షరాలు 

వల్లెవేసిన

జ్ఞాపకాలు.

నాడు నేడు ప్రజల 

సేవలో

అగ్గిపుల్ల 

అగ్గి పెట్టే .

పైస పైస కూడబెడితే రూకలౌనురా 
బొట్టు బొట్టు నీరుజేరి సంద్రమౌనురా  
ప్రజల కలిమి కలిగి వున్న దేశ బలిమిరా 
నీతి మాట లెన్నోన్నో గ్రంధమౌనురా 
మెదడును తొలిచే ప్రశ్న.
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.
 
తాడిత పీడిత స్త్రీ బాల
వృద్ధ 
యువ  బలహీన 
నిమ్న వర్గజన 
అభ్యుదయం 
తమ  ఏకైక ధ్యేయం 
మరి 
వామ పక్ష పక్షాలు  
ఏకత్రాటి పైకి అడుగిదరెందుకు?
విడి వడి ఉద్యమాలతో
సాధించేదేమీ  ఉండదని 
తెలియని అ విజ్ఞులు కారే 
మరి జాతి వారిస్తున్నాపట్టక 
ప్రజలకు కి వారిచ్చే సంకేతం  ఏమది?
 
ప్రత్యామ్నాయం కొఱకు 
తమ వంక  ఆర్తిగా చూస్తున్న
 ప్రజల ఆకాంక్షలు 
నిర్లక్ష్యిస్తూ 
తమ పట్టు దలలకే 
పెద్ద పీటలు వేసుకొని 
వాటి పైననే తిష్ట వేస్తారెందుకు?
దేశ సామాజిక ఆర్ధిక రాజకీయ 
భౌగోళిక స్థితిగతుల,
సంక్లిష్టతల పరిష్కారాలు
యీ గద్దపైని స్థితిగతుల్లో 
వెదకకుండా  
పరాయి రాజ్యాధినేతల 
ప్రతిపాదనలలో 
వెతుకుతారెందుకు  ?
తమలో తాము కుమ్ములాడుతూ 
ఆశావహ ప్రజా కాంక్షలు  తీర్చే
భాద్యతలనుండి 
తప్పించుకో జూస్తారెందుకు?
 
సాకారం 
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు. 

నేడెవరో అన్నట్లు 
అమృతమని
భావించకున్నా 
మృతం కాదు 
తెలుగు భాష 
పీక పిసుకుతూ  
ప్రభుత్వాలు 
పాటశాలల్లో 
ఆంగ్లానికే పెద్ద పీట వేసినా 
విధుల్లో ఆంగ్లాన్నే కిస్సించినా  
సౌద హర్మ్యాలనుండి
ఏనాడో తొలగించబడినా   
తన ఉనికిని  
కాపాడుకొని 
బ్రతికుతోంది 
అధిక సంఖ్యాకులైన 
గుడిసెవాసుల గుండెల్లో 
ప్రభుత్వ బడిలో 
బ్రతికున్నది  పేదల 
మమతల్లో 
సమతా వ్యక్తీకరణలో 
మాండలిక రీతుల్లో  
సరళ పద నర్తనలో 
అంతే  కాదు నేడు 
విద్యాధిక 
యువత లొ  అధికమైన 
ఉత్సాహం  
అంతర్జాల 
తెలుగు సమూహాల 
సేతలలొ సాకారం 
జీవికి రవికిరణం .. శక్తి దాత .
వైఫల్యాలంటూ ఏవీ వుండవు ….సాధనా యత్నంలో వేదనలు తక్క. 

ప్రణాళిక ఆకాశమెత్తున ఆచరణ అగాధాల లోతున.

వాటికి అ దో పిచ్చి
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు 

అవును 
వాటికి అదో పిచ్చి 
నువ్వంటే

సూరునికీ 
చంద్రునికీ 
భూమాతకు 
మువ్వురికీ 

పిచ్చి కాక మరియేమిటి ?
ఎండనక వాననక 
ఎండవానలిస్తుంటే
అది పిచ్చి కాక మరి ఏమిటి 
పిచ్చే …
నిరంతరం 
నీ కోసం శ్ర మియిస్తూ 
నిష్కలంక రీతుల 
నిద్రాహారాలు మాని …
నిద్ర ను ఆహారాన్నిస్తూ 
శక్తినిచ్చి యుక్తినిచ్చు 
ఎండ 
విశ్రాంతినిచ్చి 
శక్తి పెంచు రాత్రి 
రాత్రనక పగలనక 
రాత్రి పగలు కల్పిస్తూ 
దివారాత్రులనీయ 
సౌకర్యాలంటూ 
ఓజోను విధ్వంసం 
నీలిలోహిత కిరణ
ప్రచండ విలయం 
ప్రాణ వాయువందించే 
పచ్చని వృక్ష ధ్వంసం 
యింతటి దారుణాలు 
కాళిదాస విన్యాసం 
అవును ఇంకా 
వాటికి అ దో పిచ్చి 
మనిషంటే