కుక్షి యనే
రెండక్షరాల
ఆ సజీవ జీవ జాల
యంత్రాంగం ఆకలి యను
మూడక్షరాల తన భావనా
సం హరణా ప్రక్రియలో
జీవుల పై అధిరోహణ!!!
స్వారి చేస్తూ
వేటాడుతూ సంహరిస్తూ ….
జలంలోన భూమి పైన
వాయు పరిధి నెచటనైన
బలహీన జీవ బక్షణ

సహ జీవుల సజీవ
సంహరణా కారణ మై .
ఆక్రన్దనా భూతమై……
అను క్షణం ఆవేదన
ఆందోళన ఆక్రందన
భీతావహ మృత్యు ఘోష
జీవావళి మది లోతుల
భయం భయం ప్రాణ భయం

ఆ కుక్షే తన ఆకలి భావన
మాపుకునే ప్రక్రియలో…
ఆకలితోమానవాళి
కుక్షి నింపు యత్నం లో
ఆ మానవజీవులు
కక్ష ద్వేష క్రోధ
మద మాస్తర్య జనిత
స్వార్ధం సంకుచితం
అసహన భరిత
అహంకార భావనం
నిత్య హత్య
నిత్య హనన
నిత్య యుద్ధ
నిత్య మరణ
నిత్య జీవ హరణం
ఈ భూమాతకు
అనవరతం ఆక్రోశం
ఆ ఘాత జనిత ఆక్రందనం : రచన: నూతక్కి రాఘవేంద్ర రావు , తేది :26-01-౨ 009