చిన్నప్పుడు ఆడవాళ్ళు చీటికి మాటికి ,చిన్న వాళ్ళని తిట్టాలంటే చచ్చినాడా అనో చచ్చినోడా అనో తిట్టే వాళ్లు.ఈ తిట్లు గ్రామీణ ప్రాంతానివి కదా కొంచెం జానపద స్టైల్లో సచ్చినోడా అంటే బాగుంటుందని నా భావన.చిన్నప్పుడు ఎన్నెన్ని తిట్లు తిట్టేవాళ్ళు !! హమ్మో !! ఒకటా.. రెండా!!!
వాళ్లు తిట్టడం లో న్యాయ అన్యాయాల గురించి ఏమో గాని , ముందు నా బాధ కొంచం వినండి.ఎంత అన్యాయం ! ఆ ఆడాళ్ళ ఆ తిట్లు !! హన్నా !! అన్నీ నన్నే తిట్టాలా? అట్లా నవ్వకండి,మిమ్మల్ని తిడితే మీకు తెలిసొచ్చేది.
సచ్చినోడా,జిమ్మదియ్య ,నీ పా డి గట్ట ,నీ దివసమార ,నీ కళ్ళల్లో దబ్బనాలు గుచ్చ ,నీకు పొయ్యే కాలం రానూ ,నీకు అక్క చెల్లెళ్ళు లేరూ ,నీ నాలిక తెగ్గొయ్య ,నీ కాళ్ళు విరగ ,నీ చేతులిరిగి పోనూ ..
అయినా ఈ ఆడాళ్ళుఏ తిట్టు తిట్టినా ఆ తిట్లలో నాకు బాధ అనిపించేది కాదు . నేను చేసిన పనులు అట్లాంటివి కదా .. తిట్టకుండా ఎట్లా వుంటారు పాపం .ఏం చేసానని మాత్రం అడక్కండి .ముందు ముందు మీకే తెలుస్తుంది లే. అందుకనే యిక్కడ ఆ ప్రస్తావన తేవడం లేదు .
మొగాళ్ళ తిట్లే నాకు చాలా అన్యాయంగా అ నిపించేవి. నేను తప్పు చేస్తే నన్నే తిట్టాలి కాని అమ్మల్ని అక్కలని ,అయ్యలని తిట్టడం నాకు మాత్రం నచ్చేది కాదు .నీయమ్మ …నీయక్క , నీ చెల్లి ,నీయవ్వ యింకా కాదంటే నీయాలి అని మొదలెట్టి పచ్చి బూతులు అదేనండీ బండ బూతులు ..మీకెట్లా చెప్పాలో నాకు తెలియటం లేదు గాని ….ఏమి న్యాయం మీరే చెప్పండి ? అందుకే నేనెప్పుడు మగాళ్ళ తిట్ల జోలికి పోలేదు .మీరు నన్ను న మ్మాలి. బూతులు తిట్టలేని వాడు ,యీల వేయలేనివాడు,చెట్టుకు రాయి యిసరలేనివాడు ………వాడేం మగాడని చాలా మంది ఆడపిల్లల….వాళ్ళే కాదులెండి అనేక మంది ఆడవాళ్ళ అభిప్రాయం కూడా ననుకోండి,దానికి నేనేమి చెయ్యాలో చెప్పండి? ఎందుకో ఆపనులన్ని నాకు చెయ్యాలని అనిపించేవి కావు.
వూళ్ళో రోడ్ల మీద నడిచినా గోడల మీద పరిగె ట్ట ట మంటే చాల సరదా . గోడలెక్కి గోడల మీదే పరిగెత్తే వాడిని .గోడ ఆగి పొతే మరో గోడ…..వూళ్ళో అందరిళ్ళకి ప్రహరీ గోడల్లున్నై మరి, నేనేమి చెయ్యను చెప్పండి ?అలవాటు మరి.
ఆ గోడల మీద పరిగేట్టేతప్పుడు ఏదో దొడ్లో ఆడాళ్ళు స్నానాలు చేస్తుంటారు కదా ,కదా ఏమిటండీ తప్పా .మరి బాత్ రూమ్ లు వుండేవి కావు కదా.చు ట్టూ గోడలున్నాయని ధైర్యంగా బయటే స్నానం చేసేవాళ్ళు.ఏ గుడ్డ ముక్కో అడ్డంగా కట్టుకునేవాళ్ళు చాటు కోసం.కాని గోడ మీదుండే వాళ్లకు ఇదో అడ్డమా చెప్పండి . మరి అట్లాంటప్పుడు అటు చూడకుండా కుదురుతుందా చెప్పండి. దానికి కూడా తిట్లేనాయే … వీడి కళ్లు పడిపోను అని తిట్టాలా? నేను చాల చిన్న వాడిని కదా , కనీసం అర్ధం చేసుకోవద్దూ? నా ప్రయాణం లో ..అదేనండి బాబూ గోడల మీద …, ఒక్కో సారేమో కొందరు (కొందరే లెండి వూళ్ళో అక్కడక్కడ) ఆడ పిల్లలు వాళ్ల పక్కింటి మొగ పిల్లల్ని కావిలించుకొని కనిపించేవారు.నేనేమో చూడకుండా పోవచ్చు కదా..అయినా నేనెందుకు వూరుకొంటాను చెప్పండి , ఏంటే, నేను కూడా రానా … కావిలించుకోనా , అని పాట పాడే వాడిని. అంతే ! తిట్ల దండకం !ఇదెక్కడి న్యాయం చెప్పండి.వాడికొక న్యాయం ,నాకొక న్యాయమా.
ఆడాళ్ళు తిడితే నాకేమి అనిపించేది కాదు కాని . ఆ కుర్రాడే బూతులు అందుకునే వాడు. నేను ఎవరికి చెప్పనని అన్నా సరే . ఎం చేయాలి మరి ,నేనేమో రాళ్ళు విసిరే వాణ్ని ..గోడమీద నించి కిందికే సుమా. పైకి విసరడం రాదు కదా మరి.
ఒకో సారేమో గోడ పక్కన మంచి మంచి పళ్ళ చేట్లున్దేవి .మంచి వాటిని మంచి అనుకోవడం లో తప్పులేదు కదండీ .అట్లాగే మంచి వాటిని వదులుకోనూ లేము కదండీ ..అందుకనే నేనేమో ఆ పళ్ళ నేమో కోసు కొనే వాడి ని కదండీ .మరి అవన్నీ నేను రోజూ తిరిగే చోట్లే కదండీ ,ఆ మాత్రం చనువు తీసుకొంటే తప్పేట్లా గవుతుందండీ?అయినా అంత మంచి పళ్ళు ,నా రింజ ,బత్తాయి,ఉసిరి, ,జామ, పనస అందరి దొడ్లల్లో అన్ని వుండేవి. ఎప్పుడూ ఒక్క దగ్గరే కోయం గదండీ. అసలు కోయ కుండా వుండగలమా చెప్పండి .నేనేదో తప్పు చేసి నట్లు తిడితే నాకు కోపం రాదా చెప్పండి .
ఒక సారేమో నాలుగో యింట్లో ,కిటికీలోనుంచి లోపల ఏదో కడులుతున్నట్లుంటే పరికించి చూసా ,మామ్మ మరో మగాడు మంచం మీద దోర్లుతున్నట్టుగా అనిపించి బాబాయి అనుకొని , బాబాయి ఎప్పుదోచ్చాడే మామ్మా అన్నా ,అంతే వాడు పంచె చుట్టుకుంటూనే పరుగో పరగు .. మామ్మ కు ఏదో సాయం చేస్తా వుండి వుంటాడు .పాపం నేనే పాడు చేశా.. కొంచం ఆవతలికి పోయి చూద్దును కదా వాళ్ల పా లే రే . బాబాయి వచ్చా డనుకొన్నా రా అన్నా. వాడేమో పారిపోతుంటే ….పరిగెత్త మాక పడతావు. బాబాయికి చెప్తాలే నువ్వు పడక మంచం లో మామ్మ కు సాయం చేసావని అన్నా.అంతే వాడేమో పెద్ద రాయి తీసుకొని కోపంగా కొట్టబోయాడు .తప్పుకున్నా గాని లేకుంటేనా …
బాబాయి రెండు రోజుల క్రితమే వూరెళ్ళాడు కదా వచ్చాడనుకుని అడిగానంతే గాని ,నాకు వేరే ఏ వుద్దేశ్యం లేదు నమ్మండి.మీరే చెప్పండి నేనేమన్నానని, ఎట్లా చచ్చేది వీళ్ళతో ,చిన్న పిల్లలంటే అందరికి అలుసే కదండీ .ఎవరూ అర్ధం చేసుకోరాయే .
ఇట్లా ఎంత కాలం గోడల మీద తిరుగుతాం చెప్పండి ..అందుకే పోలాలెంట తిరుగుదామనిపించి నా గాంగ్ నేసుకుని బయలు దెరానొకసారి .నా గ్యాంగు లో ముగ్గురు మాంచి స్నేయుతులున్దేవారు. వాళ్ళేమో ఒకడు వుమ్మి గాడు,రెండో వాడు దాసు గాడు, మూడోవాడు చందు గాడు.
నా దగ్గర పాల బెల్లం, నువ్వు జీడీలు ,వేయించిన శనగ పప్పులు,వేయించిన వేరుశనక్కాయలు ,ఎప్పుడూ జేబుల్లో వుండేవి. పాల బెల్లం, నువ్వు జీదీలేమో వెంకట్రామయ్య కొట్లో నాన్న గారి పేరు చెప్పి తెచ్చుకొనే వాడిని .వేయించిన శనగ పప్పు, వేరు శనక్కాయలు , ఇంట్లోనే పెద్ద పెద్ద డబ్బాల్లో వుండేవి. అవన్నీ జేబులనిడా నింపే వాడిని.వాళ్ళకి అప్పుడప్పుడు ఏదో ఒకటి పెడతా వుంటే వాళ్లు నేను చెప్పిందల్లా చేసే వాళ్ళు. ఒకోసారి నాకోసం వాళ్లు దెబ్బలు కూడా తినే వాళ్లు.
అందరికంటే నాకు మంచి స్నేహం నా చెల్లెలు తోటి. తను కూడా ఎప్పుడూ నాతోనే వుండేది. ఒక సారి మా చెల్లి దగ్గర నుంచి మా తోటలో, మా మామిడి చెట్టు కాయ, నేను కోసిస్తే,వుమ్మిగాడు లాక్కున్నాడు .మా చెల్లెలేమో ఏడ్చేసింది .
దాంతో నాకు కోపం ఒచ్చి రాయి తీసుకునివిసిరా ,చెట్టు మీదనుంచే సుమండీ ,అది అంత గురిగా వాడి నడి నెత్తిన తగిలి కంత పడి భోల్లున రక్తం కారుతుందని నాకేం తెలుసండి .మా చెల్లేమో భయపదిందేమో తోట నుంచి పారిపోయింది ,వుమ్మిగాదేమో ఎడుచుకుంటావాడు వెళ్లి పోయాడు. మిగిలినాల్లేమో నాతొ నువ్వట్లా కొడతా వుంటే నీతో పచ్చి అని అక్కడే మోట భావి దుంగల మీద కూర్చున్నారు. నాకేంచెయ్యాలో పాలు పోలా. కిందకి దిగొచ్చి బతిమాలాడు కొన్నా.నేనేం చెయ్యను చెప్పండిరా .చెల్లిని కొడితే వూరు కొను కదా . మీరుకూడా వూరు కో కూడదు .మీలో ఎవరు
అట్లా చేసిన నేనంటేనేనంతే చేసే వాడిని. సరే పదండి వాడిని బతిమలాడి మనతోనే వుండేటట్టు చేసుకుందాం . అని వాళ్ళతో బయలు దేరి వస్తా వుంటే ఈత చెట్ల మీద కుండలు కనిపించినై .ఆ క్యల్లు కుండ లంటే నాకు చాల చిరాకు. దానికో కారణ ముందిలెండి. అది తరవాత చెబుతా.
దాసు గాడి దగ్గర ఎప్పుడు వుండేలు వుంటుంది .వాడిని రెచ్చగోట్టా.ఎరా దాసుగా నీ దగ్గర వుందేలుంది కదా ఎప్పుడైనా గురి చూసి కొట్టావంటారా అని.వాడికేమో వుడుకొచ్చి ,ఎమనుకొనావురా చూస్తావా నా వుండేలు దెబ్బ అన్నాడు,చూపించారా ,ఆ కుండల్ని వరస బెట్టి కొట్టు ,అన్నీ పగలాలి అన్నా. అంతే ఆ కుండలన్ని వరస బెట్టి పగిలి పోయి చెట్టు నుంచి వర్షంలాగా కల్లు కురిసింది.అంతే అక్కడ వుంటే వట్టు.అట్లా సారా కుండలు కూడా పగలగోట్టేవాళ్ళం.దొరికే వాళ్ళం కాదు గాని మాకు మాత్రం చాలా భయంగా వుండేది.ఎక్కడ కట్టేసి కొడతారో నని. అప్పట్లో మా వూళ్ళో తాడి చెట్లు ఈత చెట్లు చాలా ఎక్కువ.ప్రతి మెట్ట చేను చుట్టూ తాడి చెట్లు ఈత చెట్లు వుంటాయి,మధ్య మధ్య వేప చెట్లు ఇతర చెట్లు తీగలు పెరిగి అవి దట్టంగా కంచేలాగా వుండికంచె దాటాలంటే భయంగా వుండేది. పాముల పుట్టలు చాలా వుంటాయి కదా. ఎన్నో రకాల పాములు,జెర్రులు తేళ్ళు ముంగిసలు ,ఎన్నో వుంటాయి. మరి భయ మేయ్యదేంటి?అదీ కాక ముళ్ళ కంపలు.మాకు చెప్పులు కూడా వుండేవి కావు.కాలేజీ కి వెళ్ళే వాళ్ళకే పాంట్లు చెప్పులు కొనిచ్చే వాళ్లు .పొలం పనులకేల్లెవాల్లకి కుట్టిన చెప్పులున్దేవి , మన దొడ్లో గేదలు కాని ఆవులు కాని చచ్చి పొతే వాటిని evaro వచ్చి తీసుకెళ్ళే వారు. తరవాత తోలు తీసి నానబెట్టి వూన్చి కొంత తోలు తో ఇంట్లో వాళ్ళకి పాలేళ్ళకి చెప్పులు కుట్టేవాళ్ళు’. ఈ సంగతి మా నాయనమ్మ చెప్పింది లెండి. యజమానికి మాత్రం కిర్రు చెప్పలు కుట్టేవాళ్ళు ,మోటలకి తొండాలు కుట్టే వాళ్లు..మిగతా తోలుతో చెప్పులు కుట్టి అమ్ముకొనేవాళ్లు.పిల్లలికి ఆడాళ్ళకి మాత్రం ఏమి వుండేయి కాదు. ఇదెక్కడి అన్యాయం చెప్పండి.
ఇక పోతే ఇక్కడే నా బుర్రకి తెలిసి నంత వరకు ఒక సంగతి మీ అందరికి చెప్పాలనుకుంటున్నా .ఏమాత్రం చిలిపి సంగతులు కావండీ .సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా నంతే .
ఇట్లా వూళ్ళో ఆన్నిరకాల పనులు చేసే వాళ్లు వుండే వాళ్లు. వాళ్ళందరికీ వేరు వేరుగా స్థలాలు ఇచ్చి ఊళ్ళో వుంచుకునేవారు.చాకలి, మంగలి, వడ్రంగి, కంచరి, , కటిక, మేదరి ,గౌండ్ల ,ఎరుకల, పాముల యానాది ,సాతాని వగైరా వృత్తుల వాళ్లు ఊరి లో ప్రజలకు కావలసిన వస్తువులు చేసి పెట్టడం లోను, యింటి పనులు ,వ్య్వసాయాయ పనులు చేసి పెట్టడం లోను రయితులకి , వాళ్ల కుటుంబాలకి, సహాయ పాడేవాళ్ళు. వాళ్ళందరికీ సంక్రాంతికి కుప్ప నూర్పిల్ల లోనో ఇతర పంటల చేతికి వచినప్పుడో ఇంతని భాగ మిచ్చే ఆనవాయితీ వుంది .వీళ్ళే కాక గుళ్ళల్లో, ఇళ్ళల్లో పూజలు చేయడానికి అబ్దికాలు గృహ పూజలకు పూజార్లు వుండేవారు. వారందర్కి కూడా సంక్రాంతికే సంభావనలన్దేవి.ఇంక పొలాల్లో ఎలుకలు పంటలు పాడు చేసేవి,అట్లాగే పాములు వాటికోసం..అందుకుగాను పాములు పట్టేవాళ్ళు ఎలుకలు పట్టే వాళ్లు గూడా పోషింప బడేవాళ్ళు. చేటలు, జల్లెళ్ళు బుట్టలు జల్లలు అల్లేవాళ్ళు, బట్టలు నేసేవాళ్ళు అందరు పరస్పరం ఆధార పడి అంతిమంగా సంక్రాంతి పంటల కోసం ఎదురు చూసేవాళ్ళు. రైతు బాగుండాలని పంటలు పండాలని అందరు కోరుకునేవాళ్ళు.ఈర్ష్య ద్వేషాలు తెలియని ఆ కాలంలో మావూళ్లో నేను ఆ రోజుల్లో మా వూరంటే నాకు ఎంత గర్వంగా వుండేదో. పదహారు సంవస్తరాలే ఆ వూర్లో పెరిగినా ఆ ఊరికి యింత దూరంగా ఈ యాభై సంవస్త్సరాల ఆ జ్ఞాపకాలు ఇంత నేవళంగా అదో ఒక అద్భుత భావన. అసలు
చిలిపి కబుర్లు మానేసి ఒక్క సారిగా సామాజిక శాస్త్రంలోకి పంపింది మా వూరు. ఇంకా ఎన్నో చిలిపి కబుర్లు చెప్పుకోవాలి కదా. ఇప్పటికి నన్నొదిలెయన్ది ,చిన్నాడిని కదా ఆకలేస్తాంది.
రచన:నూతక్కి రాఘవేంద్ర రా వు , తేది :03-02-2009
ఫిబ్రవరి 4, 2009 at 3:26 సా.
బొమ్మలో ఉత్తరీయం కత్తిలాగుంది సార్.
ఏప్రిల్ 13, 2009 at 10:42 సా.
కొత్త పాళీ గారూ,మీ అభినందకు ప్రతిగా స్పందించేందుకు నేను విదేశీ పర్యటనలో వున్నందువల్ల చాల సమయం పట్టింది.క్షంతవ్యుడను.
మీ అభినందనను నేనానందించాను.ధన్యవాదాలు.కానీ…
కత్తిలా వున్నదని నా వుత్తరీయం
అభినందించినా మీ బోంట్లు
యేమో నా ఒకె ఒక కుత్తుకను
వుత్తరించదు కద?
ఆకలి చచ్చిపోయె
అనుమానము మనంబున
పెనుభూతమాయె నిద్ర యెరుంగ
ఆకలి దప్పిజచ్చె
నేనెట్టుల జేతును
మదీయ వుత్తరీయమును
వివరము చెప్పగ రావ పుంగవా …
నూతక్కి రాఘవేంద్ర రావు.తేది: 14-04-2009
మే 7, 2009 at 2:48 సా.
Voww.. mi kavitalu chadivanandi. chala bagunnayi. Titlu bagunnayi. Malli ma generation loo comedy ga ivi vaadutunnam – ‘donga-sachi*’ anesi 🙂 . Btw, nenu sumna nuthakki ni. WordPress loo ee peru anthe.
మే 7, 2009 at 7:06 సా.
Dear Sumana nutakki , thanks for your visit to my blog. and comment. Mana bhaasha bratakaalante vividha praantaala graameena padaalanu vaade teerunu aayaa praantaala vaaru vaari vaari maandaleekaalalo tappaka viniyoginchaali. “TENUGEDA BATUKUTAANDO NEEGITTA ERIKENA SAAROO” oka saari choodandi AANDHRA PILLA gaaru .with best wishes.
NUTAKKI RAGHAVENDRA RAO.
జనవరి 21, 2011 at 4:52 సా.
amma allari pillaada ninnu karratho kaadu muddulatho sanmaninchali……..love j
జనవరి 21, 2011 at 5:14 సా.
Thanks for your comment.Dhaatreeji .Maro maaru thaanks naa chinna naati chilipi gnaapakaalu pathinchinanduku .Muddulato kodataanannanduku moodo saari thanks.
ఫిబ్రవరి 19, 2011 at 11:06 ఉద.
Antaa mee abhimaanam mam ….sreyobhilaashi Nutakki .
ఆగస్ట్ 9, 2011 at 1:14 సా.
మీ చిలిపి జ్ఞాపకాలు బావున్నాయి.సీరియస్ పోస్ట్ ల నుంచి ఈ పోస్ట్ చాల రిలీఫ్ గా ఉంది.
ఆగస్ట్ 9, 2011 at 2:38 సా.
శైల బాల గారు! నా చిలిపి జ్ఞాపకాలు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు .చాలా కాలమయింది . నిజానికి నేను యీ పోస్టు ఒకటి ఉన్నదన్న మాట మరిచిపోయాను. అప్పుడెప్పుడో ధాత్రి గారు కామెంటు తరువాత మీరే ఆ పోస్టును చదవటం . యీ పోస్టును మన ముఖ పుస్తక మిత్రులతో పంచుకొంటే ఎలా వుంటుందంటారు? వారికి నచ్చుతున్దంటారా? మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. శ్రేయోభిలాషి …నూతక్కి