వృద్ధాప్యం)
………………..1501
పసిపిల్లలు
వృద్ధులు
ఉత్సాహం
వైరాగ్యం .
……………….
తాముగన్న
సంతానం
తమ్ముగన్న
తలిదండ్రులు
…………………….
వృద్ధాప్యం
ఆకాంక్ష
తోడునీడ
సంతానం
……………….
పసిబాలలు
వృద్ధులు
సేవలు
తిండితిప్పలు
…………………
తలిదండ్రులు
ఆధారం
సంతానం
ఛీత్కారం
………………………
పితృసేవ
సహనం
ప్రేమ
పునాది .
…………………..
మాతృసేవ
ఓర్పు
అనురాగం
ఆలంబన
………………….
వృద్ధాప్యం
దరిదాపు
ఆదరణ
ఆమడ
………………….
రెక్కలివ్వు
బాధ్యత
కన్నపేగు
సంతానం.
……………….
ఆదరణ
అసాధ్యం
ఆశవీడు
సంతునుండి
………………..
మీరిక్కడ
తామేక్కడో
పోసగదు
పరిష్కారం
………………..
వృద్ధాశ్రమాలు
అవసరాలు
సమాజం
ప్రాధమ్యత
………………….
పుట్టుక
ఒంటరి
పోకడ
ఒంటరి
………………..
బ్రతుకు
జంఝాటం
నడివీధి
నాటకం
…………………
బ్రతుకు
పోరాటం
అంతుండదు
ఆరాటం.
……………..1515.

(ఆకాశం)
………………………
ఆకాశం
బరిబత్తల
మేఘాలు
చీరలు
………………
వైనాలు
చీరలు
వినూత్నం
డిజైన్లు
……………..
అనుక్షణం
కొత్తకోకలు
ఫ్యాషన్
పెరేడ్.
………………
వూళ్ళోపెళ్లి
కుక్కలు
హడావిడీ
పిల్లమేఘాలు.
………………….
ఎక్కడో
సంబరాలు
ఆకాశం
హంగామా.
………………
మెరుపులు
కత్తులు
దూశాయ్.
మేఘాలు.
……………..
ఉరుములు
కాన్పువ్యద
వర్షం
బిడ్డ
……………………
వర్షధారలు
ఊడలు
మేఘం
మర్రి
……………………
దుఃఖిత
మేఘం
అశ్రుధార
వర్షం.
…………………..
గాలి
వాహనం
మేఘాలు
ప్రయాణవేగం.
………………1525.

ఫేస్బుక్
……………………..
ఫేస్బుక్
స్థాపకుడు
మానవాళి
సంధానకర్త
………………
హితం
స్నేహితం
ఫేస్బుక్
ప్రేమతత్వం
………………….
దూరాలు
సమీపాలు
మనసులు
ఆలింగానాలు
………………….
భూమికటు
ధరిత్రినిటు
ఉన్నచోటు
సంగమస్తలి.
……………………
సమాచారం
విప్లవం
క్షణాలు
పర్యటనలు
…………………….
పరిచయాలు
సమూహాలు
ఏకభావన
గూడొక్కటి.
……………………….
అభ్యుదయం
వినాశం
సాధనం
ఫేస్బుక్
………………..
భావాలు
వ్యక్తీకరణలు
విశ్వవ్యాప్తి
ఫేస్బుక్.
……………….
వ్యసనం
సాధనం
ఫేస్బుక్
అగ్గిపుల్ల
……………….
సాహిత్యం
విప్లవం
అక్షరహితం
ఫేస్బుక్.
…………………
తెలుగుభాష
ఊపిరులు
ఫేస్బుక్
కొలిమితిత్తి.
…………………..
ఫేస్బుక్
పాకశాల
సాహిత్యం
వంటకం
………………….
తెలుగులు
రుణగ్రస్తులు
ఫేస్బుక్
స్ఫూర్తిదాత
……………………
సాహిత్యం
వివిధం
ఫేస్బుక్
సాధనం.
……………………
తెలుగక్షరం
పురోగమనం
ఫేస్బుక్
వాహనం.
……………1540.

(మనిషి/గ్రంధం.)
……………….
విజ్ఞానం
నిక్షిప్తం
మనిషి
గ్రంధం.
…………..
తరచిచూడు
మనిషి
మనసు
పుస్తకం
………………
తెరువు
పుటలు
అంతరంగం
భావఖని
…………………
చదువు
సమాజం
మనుషులు
సంచారగ్రంధం.
………………….
సమాజాలు
గ్రంధాలయాలు
వైవిధ్యం
అంశాలు.
…………………..
అనుభవం
అంతర్నిహితం
వ్యక్తిత్వం
స్ఫూర్తిమంతం.
…………………….
చరిత్రలు
అందుబాటు
గ్రంధం
ట్రాన్స్ఫరర్
……………………
మెదళ్ళు
వైవిధ్యాలు
బ్రుహృత్గ్రంధం
ఒక్కొక్కటి.
…………………..
అంచనాలు
తగ్గించకు
ప్రతీవ్యక్తి
పుస్తకం.
………………….
అనుభవం
విజ్ఞానం
మనసు
భాండారం.
…………….1550.

(సమాజం /అభ్యుదయం)
……………………….
మనుషులు
జాతులు
ఉనికి
ప్రాతిపదిక.
………………
బ్రతుకు
పోరాటం
సంస్కృతి
కత్తిగాట్లు
………………..
సాంప్రదాయం
చేష్ట
సమాజం
వేలుముద్ర.
…………………….
నిరంతరం
పోరాటం
సమాజాలు
స్వీయరక్ష
…………………….
మనుషులు
విభాజితాలు
ప్రాంతం
ప్రాతిపదిక.
……………………..
జీవనం
వ్యవహారశైలి
సృష్టితం
జాతులు.
…………………….
భయం
సృష్టికర్త
ప్రక్రుతి
వైపరీత్యం
…………………
భయం
మారుపేరు
దయ్యం
దైవం.
…………………..
దైవం
ప్రక్రుతి
దయ్యం
వికృతి
………………….
సూర్యుడు
తొలిదైవం
భువినంతట
శక్తిదాత.
…………………..
ఉత్పాతాలు
భయాలు
క్రమానుగతం
దైవాలు.
…………………
జీవనం
అవసరాలు
సకలం
దైవాలు.
………………….
ప్రాణాంతకాలు
జీవులు
దయ్యాలు
రాక్షసులు.
………………….
సహరించు
దయ్యం
దైవం
కాలానుగతం.
…………………..
నమ్మకం
అభిమతం
ఆత్మరూపం
దైవం.
…………………..
అభిమతం
మతం
మూఢత్వం
బరి.
………………….
నమ్మకం
దైవం
ఆకారం
ఆపాదితం.
……………………
దైవం
విశ్వాసం
నమ్మకం
రాచిలుక
………………….
మతం
మూర్ఖత్వం
అహంకారం
రాబందు.
………………..
సౌభ్రాతృత్వం
మతం
మానవాళి
హితం.
……………..1570.

కలరా
కాటు
గంగానమ్మ
గ్రామదేవత.
…………….
మసూచి
మాటు
మారెమ్మ
మహిమాన్విత
……………………
ప్లేగు
పోటు
పోలేరమ్మ
ప్రతిభావని.
……………………
ఆడుకొను
రోగాలు
ఆదుకొను
నమ్మకాలు.
…………………
నమ్మకాలు
దేవుళ్ళు
బోనాలు
పరిహారం
…………………
చల్లసద్ది
ప్రసాదం
శ్రద్ధాసక్తి
సమర్పణ.
…………………
నమ్మకం
ఆత్మతృప్తి
రోగం
నిదానం.
…………………
భయం
దయ్యం
ధైర్యం
దేవుడు
…………………
నిరాశ
నిశ్వాస
ఆశ
ఉచ్వాస.
……………..
ఆశ
నిరాశలు
మనసు
క్రీడాంగణం.
………………1580.

మనుషులు
విభజనలు
ఆధిపత్యం
రాజకీయం.
…………………..
పెద్దరికం
రచ్చబండ
తీర్పు
పక్షపాతి
………………….
బలం
ఆధిపత్యం
బలహీనత
ఆర్ధికం.
…………………
అసమానత
సరిచేత
ప్రభుత్వాలు
అసఫలత
………………..
సామాజికం
ఆర్ధికం
డెబ్బదేండ్లు
రాజకీయం
………………..
ఎక్కడుంది
అక్కడే
గొంగడి
కదలదు.
………………..
కుట్రలు
కుతంత్రాలు
గ్రామాలు
సుసంపన్నం
………………….
పేదరికం
నిస్సహాయ
వెట్టిచాకిరీ
రూపాలెన్నో
…………………
ప్రణాళికలు
నిధులు
అధికారం
ఫలహారం.
……………………
విద్య
ఆరోగ్యం
సౌకర్యాలు
అందనిద్రాక్ష.
…………………..
వ్యవసాయం
ఆధారం
విత్తనం
అలభ్యం.
………………
ఎరువులు
అందనీరు
బ్లాక్మార్కెట్
రాకెట్.
……………………
విద్యుత్
అరకొర
పంటచేను
ఎండింది.
……………..
గొంతులు
ఎండాయి
బోరులు
దాహార్తి.
…………….
చేలు
పీడలు
పురుగుమందు
బ్లాక్మార్కెట్.
……………………
సేద్యం
యంత్రీకరణ
కబేళాలు
కళకళ.
………………..
పంటలు
వాణిజ్యం
త్రుణదాన్యం
కరువు.
………………..
డైరీలు
దాహార్తి
గ్రామబాల్యం
క్షీరార్తి.
………………..
పెరుగు
మజ్జిగ
మర్యాద
దాహం
………………
కొను
త్రాగు
మజ్జిగ
ప్యాకెట్లు
……………….1600