భాగ్య నగరంలో జనాభా నియంత్రణ
కో
కొంగ్రొత్త పథకం
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు
తేది :06-06-2009
( part-1 )
స్వాగాతిస్తావో చీత్కరిస్తావో నీ యిష్టం …
మనిషి శరీరాన
మైళ్ళ పర్యంతం
హృదయ కవాటాల ద్వారా
పరిశుద్ధిత రుధిరాన్ని
శరీరపు అణువు అణువు కు అందిస్తూ …
చెడు రక్తాన్ని
గుండెకు తిరిగి చేరుస్తూ
మానవ జీవ జాల
యంత్రాంగాన్ని నియంత్రిస్తూ
ధమనులు
సిరలు
ప్రక్క ప్రక్కనే పయనిస్తున్నా
చెడునూ మంచినీ కలపకుండా
కానీ
మురుగు కాలవల నీళ్ళ పైపులతో
జనాభా నియంత్రణా పారించారు
మంచి నీళ్లకూ మురుగు జలాలకు
అన్యోన్య సామ్పత్యాన్ని పెంపొందించారు
భాగ్య నగరి జల సరఫరా మురుగు అధికారులు
స్పందించండి