చోర్ కళ
( రివార్డులతో కొందరు చీత్కారాలతో మరికొందరు.)
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు.
Dt:31-10-2009
ఆ కళాపాండిత్యం
కాలంతో మారుతున్న
తీరు తెన్నులు
అభినివేశం అత్యధ్భుతం
అమవసపున్నమి,
దివారాత్రములు,
యిక్కడ అక్కడ
ఎక్కడకానీ వివిధ భంగిమల
అనంత రూపముల
సర్వదిక్కుల
అనిమేష ధ్రుఃక్కులతో
నిద్రలు కరువై
సకల పౌరులకు
సర్పద్రంష్ట్రితం…
కళాప్రదర్శనలు
నిరాఘాటమై
నిరాటంకమై
అయినా శ్రమ ఫలితం
దక్కదు పాపం
ఆదరించేవారే వుండరు.
యీసడింపులూ
చీత్కారాలూ ……..
ప్రజా సేవలముసుగుల్లో
నిరంతరం ప్రజలను
జలగల్లా పీల్చుకు తింటూ
దోచుకొనే దొరలకు
దోపిడీదారులకు
అనునిత్యం అందే
సన్మానాలూ నంది అవార్డులు
పద్మ రివార్డులు…….
. కళల లిస్టులో ఒకటైనా
కళాకారుల కోవకే చెందినా……….
దివైడ్ అండ్ రూల్ పోలసే
వారికాతీరున గౌరవమేల ,
వీరికి అనునిత్యం చీత్కారాలేల?
సాఫ్ట్ కార్నరంటూ యేమీ
లేదుకాని
వారికో తీరు , వీరికి మరో తీరేలని
ఎందుకనో అర్ధంకాక తలగోక్కుంటున్నా…….
స్పందించండి