త్రిశంఖు స్వర్గమదేనా !

రచన: నూతక్కి

తేదీ: 22-11-2009

మహోన్నత పర్వత

 శ్రుంగాలనుండి

అవని అందాలు ,

మహాధ్భుత సుందర

ద్రుశ్యాలను అవలోకిస్తున్న

 అనుభూతి .

అపార జలధులు,

నదీనదాలు

 జలపాత ద్రుశ్యమాలికలు

 హిమవత్పర్వత శ్రేణులు ,

వున్నత శిఖరా గ్రాలూ,

లోయలు,…….

శ్వేతవర్ణ మేఘమాలికల

 దొంతరలు,

దినకరుని

 కిరణపుంజాల

 సయ్యాటలు,

సృష్టించిన నీలినీడలు …..

కళ్యాణ ప్రాంగణాన

సర్వాంగభూషితలై

సందడి చేసే కన్నెల్లా

 విశ్రుంఖలంగా

విహరిస్తూ పిల్ల మేఘాలు

 తెల్లని దూది పింజల్లా

 ఆకసాన విహరిస్తున్న

శ్వేతాంచల శ్రేణుల్లా,

 వాటి నీడలు

లోయలలో నడయాడే

 జీవన స్రవంతిలా

భ్రమింపజేస్తూ,

వేలాది అడుగుల యెత్తున

ఆకసాన పయనిస్తూన్న…

నా   అంతరాంతరాళాలకు

విందొనరించిన ప్రక్రుతి

విరచించిన నేత్రపర్వ

 గానామృతమది

 మహాధ్భుత సుందర

 వర్ణచిత్రమది

 తనువున అణువణువూ

 నర్తించగ.

త్రిశంఖు స్వర్గమని

 భ్రమింపచేస్తూ

 వీనులు పఠియించే

శ్రవ్య కావ్యమది,