వ్యక్తిత్వ పునాదులు
రచన: నూతక్కి
తేదీ: 22-11-2009
(శ్రీ మిరియాల శ్రీసత్యభ్రమరార్జున ఫణి ప్రదీప్ గారి క్షణానికో రాత……..స్ఫూర్తితో )
అంధకార కుహరంలో
రూపు దిద్దుకొంటూ
జీవి వింత వింత
బాహ్య శబ్దప్రకంపననలకు
స్పందిస్తూ ……
ఆహ్లాదభరితమై కొన్ని
భయ భీకరమై మరికొన్ని
భ్రుకుటి ముడుస్తూ
ముడులు విప్పార్చుతూ
మనోఫలకమనే హార్డ్ డిస్క్ పై
నిక్షిప్తమై విశ్లేషించి రాసిన రీతులే
భ్రుకుటి ముడతల గీతలు
బ్రహ్మ రాతలు
యిరుకిరుకుగా
గర్భ కుహరాన
యిముడుతూ
ముడుచుకున్న
అరచేతుల మడతలలోగీతలు
అరి కాలిలోని రేఖలూ
ఆకారం పొందుతున్న
గర్భావస్త జీవ
భావోద్వేగ ప్రకంపనల
విశ్లేషణలు
మానవ వ్యక్తిత్వ
ప్రాకారాల పునాదులు
నవంబర్ 24, 2009 at 1:48 ఉద.
Cool one
నవంబర్ 24, 2009 at 8:35 ఉద.
Thanq v.much….Nutakki
నవంబర్ 24, 2009 at 7:37 సా.
http://ayyayyokcr.wordpress.com/
నవంబర్ 24, 2009 at 10:56 సా.
Ramakanta reddy garu…tahnks for visiting my site….Nutakki
నవంబర్ 25, 2009 at 3:50 సా.
Thanq v.much for visiting my blog…..with wishes….Nutakki