భారత ప్రభుత్వం ద్రుష్టి సారించిన సోలార్ ఎనెర్జీ

రచన: నూతక్కి రాఘవేంద్ర రావు.

Dt: 27-02-2010

2010/11 వ సం/ బడ్జెట్లో భారత ప్రభుత్వం సాంప్రదాయేతర ప్రక్రియలైన సౌర మరియు పవన విద్యుత్తు వ్యవస్తల వైపు పెద్ద ఎత్తున ద్రుష్టి సారించినట్లు కనబడుతోంది .ఇది అందరం అహ్వానించ దగ్గ పరిణామం.ముదావహం.లోగడ యెన్నో పర్యాయాలు నా బ్లాగుల్లో యీ విషయం పై నా గోడు వెల్లడించిన సందర్భాలున్నాయి.యీ ప్రక్రియలపై చిత్త శుద్ధితోప్రభుత్వాలు నిబద్ధతతో వుంటే సామ్ప్రదాయ, అణు ఇంధన వనరులకొరకు విదేశాలపై ఆధార పడవలసిన అవసరం వుండదు.మన యింధన వనరులను ఎగుమతి చేసి ఆర్ధిక స్వావలంబన పొందవచ్చు. అణు ఇంధనం, ఆయిలు ఇంధనం కొరకు దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్ట వలసిన అవసరం వుండదు.

వికేంద్రీక్రుత రీతిలో యీ ప్రక్రియ కొనసాగాలి. భారీ విద్యుత్ ప్రోజెక్టుల నిర్మాణం వైపు కాకుండా అందుకై వెచ్చించే ధనాన్ని సోలారుకిట్లపై, వెచ్చించి ప్రతి యింటా ప్రభుత్వ ఖర్చు పై వాటిని స్థాపించాలి . తొలుత కిట్లు దిగుమతి చేసుకున్నా తదుపరి ఆయా వుత్పత్తిదారులను భారత్ కు ఆహ్వానించి, భారత్ లోనే వుత్పత్తిని ప్రోత్సహించాలి.

ప్రతి యింటి అవసరానికి మించి వుత్పత్తిఅయ్యే విద్యుత్తును ప్రభుత్వం తానే తీసుకొని తన భారీ అవసరాలకు వినియోగించవచ్చు. సోలార్, మరియూ పవన విద్యుదుత్పత్తికై ప్రతి పరిశ్రమలోనూ నిర్బంధ విధానాన్ని ప్రవేస పెట్టాలి.

గాలీ ,సూర్య రశ్మీ విరివిగా లభించే భారత దేశం వంటి దేశాలలో యీ ప్రక్రియలు దిగ్విజయమౌతాయి.

శాస్త్ర సాంకేతికపరిగ్నాన లభ్యత, యంత్ర పరికరాల లభ్యత, అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు వెంటనే ప్రారంభిస్తూ ,సాంకేతిక ప్రతిభ గల మానవవనరులను అభివ్రుద్ధి పరచ వలసిన కార్యక్రమం వెనువెంటనే చేపట్టవలసిన భాద్యత ప్రభుత్వాలపై వుంది. కెనడాలోలా,జెర్మనీలోలా ,ప్రతి యిల్లూ ఓ విద్యుదుత్పత్తి కేంద్రం గా ప్రభుత్వాలు మార్చగలిగితే

నిరంతర విద్యుత్ అంతరాలనుండి విప్లవాత్మక విశ్రాంతి లభించి విద్యుత్ పరికరాల వినియోగం ప్రతి యింటా పెరుగుతుంది. ఆయా గ్రుహవినియోగ విద్యుత్ పరికరాల వుత్పత్తుల తయారీ పరిశ్రమలూ పెరుగుతాయి..సోలార్,పవన విద్యుత్ వుత్పాదక పరికరాల కై పరిశోధనాలయాలూ తద్వారా పరిశ్రమలూ, సాంకేతిక పరిగ్నానం రుగుతుంది.వుపాధి అవకాశాలూ పెరుగుతాయి.నిరుద్యోగ సమస్య తగ్గి దేశ ఆర్ధిక పరిస్థితి పురోగమనంలో సాగుతుంది.