ఇక బ్లాగడం మానేసి ….

నూతక్కి

తేది:13-03-2010

కొంతకాలం నా బ్లాగులో రాతలు మానేసి. ఒకటొక్కటిగా తోటి బ్లాగర్ల బ్లాగులు వీక్షిద్దామనుకొంటున్నా.. వాళ్ళు రాసేదేమిటో, వాళ్ళకు వచ్చే కామెంట్లేమిటో? మనం ఎలా కామెంటితే వారికి నచ్చుతుందో.. ఎలాటివి రాస్తే బ్లాగర్లు స్పందిస్తున్నారో…….లాటివి నేర్చుకొని ..తిరిగి బ్లాగడం మొదలెడితే ఎలా వుంటుందంటారు? అదేంటో యీమధ్య బ్లాగర్లు మాటల్లో చాల పొదుపు పాటిస్తున్నారు. కామెంట్లకు స్పందనలుండడంలేదు..

నేను బ్లాగుల్లో వ్రాయడమ్ మొదలు పెట్టీంది మాత్రం రచనలను ఒక చోట భద్రపరుచుకొందామనే. కాని మా మనవడేమన్నాడంటే, ఇంతా రాసి దాచిపెట్టుకోవడమెందుకు తాతా,అందరికీ ఓపెన్ చేసి పెడదామని అన్నాడు. చదివినవాడు చదువుకుంటాడు. నచ్చితే అభినందిస్తాడు. లేకుంటే విమర్సిస్తాడు. అన్నాడు. వాడికున్నంత ఆలోచన నాకు లేకపోయెనే అనుకొని సరేలే కానియ్యన్నా.

అప్పటికి స్పందనలూ ప్రతిస్పందనలూ వుంటాయని నాకు తెలియదు. ఒక సారి సిబి రావు గారు అమెరికాలో వున్నప్పుడు కలిసి స్పందనలేమైనా వస్తున్నాయా? అని అడిగారు. వస్తున్నాయంటే ,సమాధానాలు వ్రాస్తున్నారా అని అడిగారు.లేదన్నా. అదేంటి బ్లాగులో వ్రాయడమంటే రాసి వూరుకోగూడదు, స్పందనలూ ప్రతిస్పందనలూ, యితర బ్లాగులు చదవడాలూ వాతిపై మీ స్పందనలుంచడాలూ తప్పవు అని అన్నారు.

అప్పటి నుండి బ్లాగులన్నిఒకసారి తిరగేద్దామనుకున్నా కాని అవకాశాలు రాలా. అందుకే యిప్పుడు యీనిర్ణయం. తీసుకోనా?.

 కొందరైతే వారి గ్రూపువారి కామెంట్లనే అనుమతిస్తారు. అక్కడ కామెంట్లెలాగూ వుంచలేం. అక్కడ మనకు బాధలేదు. మనం కామెంట్లెయ్యాల్సిన బాధుండదు. వాళ్ళ రచన నచ్చితే బాగుందనుకుంటాం, మరీ నచ్చితే మన బ్లాగులో అభినందిస్తాం. బాధుండదు.

కొందరు బ్లాగర్లు, వాళ్ళంతట వాళ్ళు తమను తాము ఒక హై లెవెల్లో వూహించుకొంటుంటారు. వాళ్ళు గొప్ప సాహితీవేత్తలై వుండవచ్చు, విశ్లేషకులు కావచ్చు. పాపం. వారు కామెంట్లకు బ్లాగును తెరిచి వుంచుతారు గాని , ఎంతమందెన్ని రాసినా, వులుకూ పలుకూ వుండదు. పిచ్చోళ్ళు రాసుకొంటూ పోతారు రాసుకోనీ అనుకుంటారు.వాళ్ళకు నచ్చినోళ్ళకు మాత్రం ఒక కామెంటేసి పల్లకుంటారు.

మరికొందరుఉంటారు. ఏదో ఒక పోష్టులో కామెంటు స్తానే సాఫ్ట్వేర్ భాషలో ఏదో వ్రాసేస్తారు. ఏంటో అనుకొని ఆబ్లాగుకు వెళ్ళి ఓకొత్త పోష్టు చూడాలనమాట. యేమిటో బ్లాగ్లోకపు తీరులు.

అందుకే ఇకపై అన్ని బ్లాగులూ వ్రాసే సమయాన్ని బ్లాగులు పరిసీలించడానికి కామెంట్లు స్వీకరించి స్పందించేవారిని ప్రోత్సహించదానికీ వినియోగించదానికి నిశ్చ్చయిమ్చుకున్నా. మీరేమంటారు?

మరికొందరుంటారు. మొదటి పేజీలోనే.. నా బ్లాగును వీక్షించిన వారికీ స్పందించిన వారికీ ధన్యవాదాలు అనేసి కామెంట్లకు స్పందించరు. అలాటప్పుడు కామెంట్లకు బ్లాగును తెరచి వుంచ గూడదు మరి. కాని. కామెంట్లు కావాలి, స్పందించి టైం వేస్టు చేసుకోరు. వారి సమయం విలువైనది యితరులది విలువలేనిది అన్నట్లుంటుంది. కొందరేమో రెగులర్ కాంటాక్టులో వుంటూనే సదెన్గా మానేస్తారు. మానేస్తే మనకేమీ బాధలేదు కానీ, మనం వాళ్ళనేమన్నా నొప్పించామా , ఎక్కడైనా ట్రాన్స్లిటరేషణ్ లో పొరబాట్లు దొరిలి తప్పుడు అర్ధాలకు ఆస్కారమిచ్చామా? అనే సందేహాలు కొట్టుమిట్టాడుతుంటాయి. మననుంచి పొరబాట్లు జరగకూడదుకదా మరి. యిట్లా రాసుకొంటూ పోతే అసలు నా ప్రశ్న మరుగున పడి పోతుంది. అందుకే యింతటితో సరిపెడుతున్నా.యింతకీ నన్నేమి చెయ్యమంటారు