తన్మయత
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు.
తేదీ :15-12-2012.
సమయం ప్రాత:కాలం :05-59

అక్కడ ఎవరూ లేరు

ఒక్కడినే ఒక్కడిగా ఒంటరిగా
అయనా నేను ఒంటరిని కాదు
నీలాకాసం ఓ కాన్వాసుగా మారి
అందమైన రంగులతో ఎన్నెన్నో చిత్రాలు
రంగులద్దు తూ దినకరుడూ నా చెంత జేరి
సరదాగా గడుపుతాడు
విచిత్రంగా నె చూస్త్తూ వుండి పోతే
పక పక నవ్వుతాడు
మేఘాలు చేట్టులూ
పుట్టలూ పక్షులూ
ఎన్నెన్నో పలకరింపులు
నను పులకరింప జేస్తూ
మరెన్నో ముచ్చట్లు నా
మనసును రంజింప జేస్తూ
పచ్చని పసిరికలో చక్కని ఆ గడ్డి పూలు
నాతొ వూసులకై దరి చేరిన ఆకులు
ఎవేవేవో మాటలు ఏవేవో
వేదనలు అనుభవాలు
నాతొ పంచుకో జూస్తూ
పక్షుల పలకరింపు
కరిగే మేఘాలలో పలకరించు ఆకారాలు
పిల్ల గాలి వచ్చి కౌగలించి పోతుంది
ప్రక్కనున్న గడ్డి దుబ్బు
ఆప్యాయంగా తాకుతుంది
నీలాకాసం ఓ కాన్వాసుగా మారి
అందమైన రంగులతో ఎన్నెన్నో చిత్రాలు
రంగులద్దు తూ దినకరుడూ నా చెంత జేరి
సరదాగా గడుపుతాడు
విచిత్రంగా నె చూస్త్తూ వుండి పోతే
పక పక నవ్వుతాడు
ప్రకృతి నర్తనలో రామణీయపు పద గతిలో
తన్మయ వేదనలో
ఒక్కడినే ఒక్కడిగా ఒంటరిగా
వున్నా
అయనా నేను ఒంటరిని కాదు